హైదరాబాద్ మహానగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి పేరుతో నకిలీ మెయిల్ ఐడి క్రియేట్ చేసి..అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని.. తార్నాకకు చెందిన బాబుకు మెయిల్ చేశారు. తన మిత్రుడి పేరుతో రావడం వల్ల నిజమే అనుకొని.. వారు పంపించిన అకౌంట్కు రూ. 50 వేల నగదు బదిలీ చేశాడు.
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
మరుసటి రోజు డబ్బు పంపిన విషయమై తన మిత్రుడి వద్ద ఆరాతీసిన బాబు.. మోసపోయినట్లు తెలుసుకున్నాడు. తనకు వచ్చిన ఈమెయిల్ ఆధారంగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి