ETV Bharat / state

'కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం'

తెలంగాణ ప్రభుత్వం ఎంతో మంది కళాకారులను గుర్తించి, వారి కళలను ప్రోత్సహిస్తోందని సంగీత దర్శకులు ఆర్​పీ పట్నాయక్​ అన్నారు. కళాకారులను వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇప్పించడం అభినందనీయమన్నారు.

author img

By

Published : Apr 19, 2019, 6:01 AM IST

'కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం'
'కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం'

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తుందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, నటుడు ఆర్‌పీ పట్నాయక్‌ అన్నారు. తెలంగాణలో ఎంతో మంది ప్రతిభ ఉన్న కళాకారులు ఉన్నారని...వారి గుర్తించి ఆర్థికంగా సహాయం అందిచడమే కాకుండా వేదికపై ప్రదర్శనలు ఇప్పించడం అభినందనీయమన్నారు.
హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సుస్వరవాహిని సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్వరాభిషేకం పేరిట నిర్వహించిన సినీ సంగీత విభావరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగీతం రాని నాకు సంగీతం నేర్పిన గురువు సంగీత కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పీ పట్నాయక్‌ తో పాటు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణతో పాటు పలువురు కళాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌పీ పట్నాయక్‌తో పాటు పలువురు కళాకారులను సుస్వరవాహిని సాంస్కృతిక సంస్థ సత్కరించింది.

ఇవీ చూడండి:

మహిళా సాధికారత దిశగా మెట్రో 'తరుణి'

New Delhi, Apr 17 (ANI): Union Defence Minister Nirmala Sitharaman in an exclusive interview to ANI on Wednesday said that post the Supreme Court order allowing leaked documents in the review petition of Rafale case, the position of the central government, which had objected to use of leaked documents, has become 'firmer' instead of 'weaker' that some people are trying to portray. Sitharaman added that even if SC allows the 'stolen documents' in Rafale review petition, it doesn't alter the 'clear process' which was adopted for the purchase of 36 Rafale fighter jets.

For All Latest Updates

TAGGED:

rpmusic
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.