ETV Bharat / state

కేసీఆర్ నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ సమ్మె.. - మహిళా, ట్రాన్స్​జెండర్‌ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్​టేబుల్​ సమావేశం

హైదరాబాద్​ సోమాజీగుడాలోని ప్రెస్​క్లబ్​లో మహిళా, ట్రాన్స్​జెంజర్​ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రౌండ్​టేబుల్​ సమావేశం నిర్వహించారు. సదస్సులో ప్రజాసంఘాల నేతలతో పాటు పెద్దఎత్తున ఆర్టీసీ మహిళా కార్మికులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్​పై మహిళా కార్మికులు మండిపడ్డారు.

ROUNDTABLE MEETING WITH TSRTC WOMEN EMPLOYEES IN PRESSCLUBE
author img

By

Published : Oct 17, 2019, 7:32 PM IST

'సమస్యలు పరిష్కరిస్తారా... గద్దె దిగుతారా...'

తమ సమస్యలు పరిష్కరిస్తారా లేక గద్దె దిగేందుకు సిద్ధంగా ఉన్నారా... అంటూ ఆర్టీసీ మహిళా కార్మికులు సీఎం కేసీఆర్​కు ప్రశ్నలు సంధించారు. నెల రోజుల ముందు సమ్మె నోటీస్‌లు ఇచ్చినా... కేసీఆర్‌ స్పందించలేదని ఆరోపించారు. హైదరాబాద్‌ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మహిళా, ట్రాన్స్​జెండర్‌ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్​టేబుల్​ సమావేశం నిర్వహించారు. 'ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకుందాం... ప్రైవేటీకరణ నుంచి ఆర్టీసీని కాపాడుకోవటం మనందరి బాధ్యత' అనే అంశాలపై చర్చించారు. సమావేశంలో పీఓడబ్ల్యు నాయకురాలు సంధ్య, ఝాన్సీ, సత్యవతి, సూజాతతో పాటు పెద్దసంఖ్యలో ఆర్టీసీ మహిళా కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు బందున్నాయి కానీ... మద్యం దుకాణాలేందుకు మూసేయలేదని పలువురు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి కార్మికులతో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే భవష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదీ చూడండి: "జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.