హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, రైతు వ్యవసాయ విధానాలపై కేసీఆర్ యూటర్న్ అనే అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శి బోసురాజు, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, వ్యవసాయ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి, కన్నెగంటి రవి, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేశ్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : వినూత్న ఆలోచన... సాయం కోరిన క్షణాల్లోనే రక్షణ