ETV Bharat / state

'ఇంజినీర్లు చెప్పినా వినని సీఎం వల్లే కాళేశ్వరంలో ముంపు పరిస్థితులు' - round table meeting on kaleshwaram project floods

హైదరాబాద్‌ సోమాజిగూడలో 'కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమా-ప్రకృతి వైపరీత్యమా' అనే అంశంపై రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, తెజస అధ్యక్షుడు కోదండరాం, పలువురు విశ్రాంత ఇంజినీర్లు చర్చలో పాల్గొన్నారు. ఇంజినీర్లు చెప్పినా వినని ముఖ్యమంత్రి ఉండటం వల్లే కాళేశ్వరంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు పేర్కొన్నారు.

'ఇంజినీర్లు చెప్పినా వినని సీఎం వల్లే కాళేశ్వరంలో ముంపు పరిస్థితులు'

author img

By

Published : Jul 22, 2022, 4:04 PM IST

కాళేశ్వరంలో కోట్ల రూపాయల పంప్​హౌస్​లు నీట మునిగాయని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ ఆరోపించారు. ఇంజినీర్లు చెప్పినా వినని సీఎం ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మంథని, మంచిర్యాల పట్టణాలు తొలిసారి నీట మునిగాయని ఈటల పేర్కొన్నారు. ఒక్కసారి ముంపునకు గురైతే పదేళ్లయినా కోలుకోలేరని.. బాధితులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారన్న ఈటల.. ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించాలని హితవు పలికారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో 'కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమా-ప్రకృతి వైపరీత్యమా' అనే అంశంపై జరిగిన రౌండ్​ టేబుల్​ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇంజినీర్లు శాశ్వత చర్యల గురించి ఆలోచన చేయాలని ఈటల పేర్కొన్నారు. వరదలతో రాష్ట్ర ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటుంటే.. నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ బాధ్యత లేకుండా విదేశాల్లో తిరిగారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి అధీనంలో ఉన్న శాఖలోనే అధికారులు ఇలా పని చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక మంచి వర్షాల వల్లే పంటలు పండుతున్నాయని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒరిగిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

గతంలో నేనే గొప్ప ఇంజినీర్​ను అని సీఎం కేసీఆర్​ చెప్పారు. ఇంజినీర్లు చెప్పినా వినని ముఖ్యమంత్రి ఉండటం వల్లే కాళేశ్వరంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా ఇంజినీర్లు శాశ్వత చర్యల గురించి ఆలోచించాలి. గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వం ఆ ప్రజలకు భరోసా కల్పించాలి. రాష్ట్రం ఏర్పడ్డాక మంచి వర్షాల వల్లే పంటలు పండుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒరిగిందేమీ లేదు. - ఈటల రాజేందర్​, భాజపా ఎమ్మెల్యే

తాజా వరదల వల్ల గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. భద్రాచలం వాసులు ఇక తాము ఇక్కడ ఉండలేమంటున్నారని తెలిపారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ప్రాంతంలో వేలాది ఎకరాలు మునిగాయన్న ఆయన.. వాటికి పరిహారం లేదన్నారు. ప్రాజెక్టు వల్లే ముంపు ఎక్కువగా ఉందని.. ప్రభుత్వం అందించే రూ.10 వేలు దేనికి సరిపోవన్నారు. మానవ తప్పిదం వల్ల ఇదంతా జరిగిందని ఆయన ఆరోపించారు. దీనికి కారణమైన వ్యక్తిని శిక్షించాలన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

తప్పించుకునే ప్రయత్నం..: సీఎం స్థాయి వ్యక్తి 'క్లౌడ్ బరస్ట్​' అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కోదండరాం విమర్శించారు. కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విపత్తు ద్వారా నిర్వహణ నుంచి మేఘా కంపెనీని తప్పించి లాభం చేయాలని చూస్తున్నారన్న ఆయన.. పెంటారెడ్డి లాంటి ఇంజినీర్లు.. ప్రభుత్వ తప్పులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందనే విమర్శలు వస్తున్నాయన్నారు. జర్నలిస్టులు చలో కాళేశ్వరం పెడితే తామంతా వస్తామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ముంపు ఎక్కువగా ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు వరదలతో భయబ్రాంతులకు గురయ్యారు. వరద బాధితులకు ప్రభుత్వం అందించే రూ.10 వేలు దేనికీ సరిపోవు. సీఎం కేసీఆర్​ క్లౌడ్ బరస్ట్​ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విపత్తు ద్వారా మేఘా కంపెనీని నిర్వహణ నుంచి తప్పించి లాభం చేకూర్చాలని చూస్తున్నారు.-కోదండరాం, తెజస అధ్యక్షుడు

కాళేశ్వరం, మిషన్​ భగీరథ విఫలం..: కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు మానవ తప్పిదమే అని విశ్రాంత ఇంజినీర్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. కాళేశ్వరం నిర్మాణమే సక్రమంగా చేపట్టలేదన్నారు. వాస్తవానికి భిన్నంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలు విఫలమయ్యాయన్నారు.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు విషయంలో ప్రకృతి వైపరీత్యానికి మానవ తప్పిదం తోడైందని రిటైర్డ్​ ఇంజినీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యామ్​ప్రసాద్​రెడ్డి పేర్కొన్నారు. రెండు పంపులు మునిగేసరికి.. లక్ష కోట్లు మునిగాయనడం కరెక్ట్ కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇచ్చిందని.. టెక్నికల్​గా ఎలాంటి తప్పిదాలు లేవని స్పష్టం చేశారు.

అన్నారం పంపింగ్ స్టేజ్ 130 మీటర్ల వద్ద ఉంటే.. వరద 131 మీటర్ల వరకు వచ్చిందని శ్యామ్​ప్రసాద్​రెడ్డి పేర్కొన్నారు. దీనివల్లే మంథని పట్టణంలోకి నీళ్లు వచ్చాయని తెలిపారు. ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డిపై కొందరు విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్న ఆయన.. తెలంగాణలో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ పెంటారెడ్డి చలవేనన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు విషయంలో ప్రకృతి వైపరీత్యానికి మానవ తప్పిదం తోడైంది. రెంపు పంపులు మునిగేసరికి లక్ష కోట్లు మునిగాయనడం కరెక్ట్​ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇచ్చింది. టెక్నికల్​గా ఎలాంటి తప్పిదాలు లేవు. ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డిపై విమర్శలు చేయడం కరెక్ట్​ కాదు.-శ్యామ్​ప్రసాద్​రెడ్డి, రిటైర్డ్​ ఇంజినీర్ల ఫోరం అధ్యక్షుడు

ఇవీ చూడండి..

KTR Comments: 'తెరాసపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై రుద్దకండి..'

ఎద్దు వీరంగం.. పది మందికి గాయాలు

రెండు పిట్టల్ని మింగిన పాము.. బోనులో చిక్కి అవస్థలు.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.