RTA Officers checking: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ వేళ ఇష్టారాజ్యంగా ప్రయాణికుల వద్ద చార్జీలు దండుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నారు. చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించి జరిమానా విధిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా తిరిగే ప్రైవేటు బస్సులపై కొరడా ఝళిపిస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా గురువారం ఒక్కరోజు చేపట్టిన తనిఖీల్లో 87 బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు.
విశాఖ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో నిన్న ఒక్కరోజే 16 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణాశాఖ అధికారి జీసీ రాజారత్నం తెలిపారు. ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 87బస్సులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 3బస్సులను సీజ్ చేశామని, అపరాధ రుసుంగా రూ.4.09లక్షలు వసూలు చేశామని వివరించారు. పండుగ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించి తగుచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 17వరకు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.
ఇవీ చదవండి :