ETV Bharat / state

రోడ్డు భద్రత ఎక్కడ పాటిస్తున్నాం..? - రోడ్డు భద్రత

దేశంలో చాలామంది హక్కుల విషయంలో పోరాడినట్లుగా బాధ్యతల విషయంలో స్పందించరు. వాటి గురించి పట్టించుకునే సమయమూ ఉండదు. ఒక్కసారి చేస్తే ఎం అవుతుందిలే అనుకుంటాం. నిబంధనలను ఉల్లంఘిస్తాం. రోజూ రోడ్డుపై వెళ్లేటప్పుడు ఏం చేస్తామో ఒక్కసారి చూద్దాం...

traffic rules
author img

By

Published : Jul 22, 2019, 12:22 PM IST

రోడ్డు భద్రత ఎక్కడ పాటిస్తున్నాం..!

తనది కాదంటే చాలు వాటిమీద ఉన్న నిర్లక్ష్యం అంతా ఇంతకాదు. ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించి భలే తప్పించుకున్నాం అనుకుంటారు. రోడ్డుపై వాహనాలను ఇష్టానుసారంగా పార్క్ చేస్తాం. పక్కవాడు హారన్ కొడుతున్నా పక్కకు తప్పుకోం. ఆఖరికి అంబులెన్స్ వస్తున్నా... దారి ఇవ్వం. నాకు నచ్చిందే నేను చేస్తానని అంటాం. ట్రాఫిక్‌ జామ్‌ అయితే అప్పటికే ఉన్న వరుసలో వాహనాన్ని నిలిపేస్తారు. పక్క లేన్‌లోంచి దూసుకెళ్లి సమాంతరంగా కొత్త వరుస సృష్టిస్తారు. ఇంకో లేన్‌లో వెళ్లే అవకాశం లేకపోతే ఫుట్‌పాత్‌ మీద నుంచి అయినా సరే బండిని పోనిస్తాం తప్ప తగ్గే ప్రసక్తే లేదు.

రోడ్ల మీదకు వెళ్తే క్షేమంగా ఇంటికి వెళ్లే గ్యారంటీ లేదు. రహదారి నిబంధనలు, నియమాల పట్ల అవగాహన లేకపోవడమే కారణం. కొందరు ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్​లో అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతూ మిగతా ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతున్నారు. రద్దీగా ఉన్న ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర.. ఎడమపక్క మళ్లాల్సిన వారి కోసం ఉండే ఫ్రీలెఫ్ట్‌ ను కూడా వదలరు. రద్దీగా ఉన్న రోడ్డు మీద రివర్స్‌ తీసుకోవడం.. పొరపాటున బండికి వేరే బండి తాకితే మాట్లాడే పనే లేదు.. మీదపడి గొడవకు దిగడమే. ఇద్దరి గొడవకారణంగా వెనకాల డజన్ల కొద్దీ వాహనాలు బారులు తీరి ఉంటాయి.

డివైడర్ల మీద నుంచి బండి ఎక్కించేస్తారు. డివైడర్ల మధ్య సందుల్లోంచి కూడా పోనిచ్చేసి నిబంధనలు అతిక్రమిస్తారు. వాహనాలకు భారీ హారన్లు పెడతారు. ట్రాఫిక్‌ జామ్‌ అయిన విషయం కళ్లముందు కనిపిస్తూనే ఉంటుంది. అయినా చెవులు చిల్లులు పడేలా హారన్‌ కొడుతుంటారు. పెద్దలు, చిన్నపిల్లలు రోడ్డు దాటుతున్నా ఒక్క క్షణం ఆగరు. మద్యం సేవించి వాహనాలు నడుపుతారు. ఆపి చలానా వేస్తే మరి మద్యం ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తారు. ట్రాఫిక్‌ రూల్స్‌ అంటే అది పోలీసులు చలానా వేయడం కోసమే తప్ప... మన కోసం కాదన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు.

కొందరైతే తమ ఇళ్ల ముందే స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటుండగా... మరికొందరు రోడ్లపైనే విందులు, వినోద కార్యక్రమాలను చేపడుతూ మిగతా వారికి ఇబ్బందులు సృష్టిస్తున్నారు.

కొందరు రోడ్లపైనే నిర్మాణ సామగ్రిని పోస్తూ వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. గ్రామాల్లో రహదార్లనే మరుగుదొడ్లుగా మారుస్తున్న ఉదంతాలు ఇప్పటికీ చోటుచేసుకుంటున్నాయి. పట్టణాలు, నగరాల్లో పశువులను రోడ్లపైనే విడిచి పెడుతున్నారు.

ఇవన్నీ నిత్యం జరిగేవే కానీ.. అవే తప్పులు ఎదుటివాళ్లు చేస్తే మాత్రం ఎక్కడా లేని కోపం తన్నుకు వస్తుంది. ఒక్కడికి కూడా సంస్కారం లేదు, ట్రాఫిక్‌ రూల్స్‌ తెలియవు. రాంగ్‌ రూట్‌లో వచ్చి ఎలా బుకాయిస్తున్నారో చూడండి అంటూ పక్కనున్న వాళ్లకు చెప్తుంటారు. తాము మాత్రమే నిబంధనలు పాటిస్తున్నట్టు.. ఎదుటి వాళ్లకు వాటి గురించి తెలియనట్టు మాటలు వస్తాయి. ఎక్కడాలేని నీతులూ బాధ్యతలూ అన్నీ ఒకేసారి వల్లె వేస్తారు. వీరిని అని ఏం లాభం వాళ్లు పట్టించుకుంటే కదా అని నెపం మొత్తం ప్రభుత్వం మీద వేసేస్తారు. తమదాకా వచ్చినప్పుడే వారికి సివిక్ సెన్స్ గురించి తెలిసి వస్తుంది. నేనొక్కడినే రూల్స్‌ పాటించకపోతే కొంపలేం మునిగిపోవులే అనుకునే సగటు భారతీయుడి మెంటాలిటీ కారణంగా మొత్తం సమాజంలోనే పౌరస్పృహ లేకుండా పోతోంది.

ఇవీ చూడండి:అమ్మకే అమ్మ అయిన చిన్నారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.