హైదరాబాద్ పంజాగుట్ట ఠాణా పరిధిలోని యశోద ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులిద్దరిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం'