హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. సాగర్ రింగ్ రోడ్డు నుంచి బీఎన్ రెడ్డి నగర్ వైపు వెళుతున్న షిఫ్ట్ కారు అతివేగంతో డివైడర్ను ఎక్కి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటన స్థలంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు