బాచుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ట్రాలీ ఢీ కొట్టిన ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంగారెడ్డి జిల్లా, బొల్లారానికి చెందిన రవీందర్ బాచుపల్లిలోని మమత ఆసుపత్రిలో వార్డుబాయ్గా పనిచేస్తున్నాడు. అతని చెల్లెలి కుమార్తెకు అనారోగ్యం కారణం వల్ల మమత ఆస్పత్రిలో వైద్యం చేయించి తిరిగి ఇంటికెళ్లేందుకు నిన్న సాయంత్రం సమయంలో కుటంబ సభ్యులతో సహా ఆస్పత్రి బయట ఆటో కోసం ఎదురు చూస్తున్నారు.
అదే సమయంలో మియాపూర్ నుంచి బాచుపల్లి వైపు వెళ్తున్న ఆటో ట్రాలీ వేగంగా వచ్చ వీరిని ఢీ కొట్టింది. ఘటనలో రవీందర్ కుటుంబ సభ్యులు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందే టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న మరో వ్యక్తిని ఢీ కొట్టింది. ప్రమాదంలో మొత్తం ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను మమత ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఆటో డ్రైవర్ శ్రీహరిని అదుపులోకి తీసుకుని... విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: చరవాణి కేసు లాగితే కేటుగాళ్ల డొంక కదిలింది