సికింద్రాబాద్లోని ఓ హోటల్లో విద్యాహక్కు చట్టం ఫోరం ఆధ్వర్యంలో చైల్డ్ ఫండ్ ఇండియా సంయుక్తంగా విద్యాహక్కు చట్టం అమలు తీరుపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, బీసీ కమిషన్ ఛైర్మన్ రాములు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాల విషయంలో లోపలున్నాయని వక్తలు వెల్లడించారు.
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డ పేదలు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమాజంలో డిమాండ్కు అనుగుణంగా విద్యాబోధనలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్