ETV Bharat / state

Huzurabad bypoll: కాంగ్రెస్​ కీలక నేతలతో రేవంత్​ భేటీ.. హుజూరాబాద్ ఉపఎన్నికపై చర్చ - gandhi bhavan latest news

హుజురాబాద్‌ ఉపఎన్నికపై(huzurabad bypoll) కాంగ్రెస్‌ నేతల దృష్టి సారించింది. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ విజయం కోసం వ్యూహంపై చర్చిస్తున్నారు.

Huzurabad bypoll
Huzurabad bypoll
author img

By

Published : Oct 9, 2021, 1:09 PM IST

హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో(huzurabad bypoll) అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు (congress leaders) గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. తెరాస, భాజపాను ఎదుర్కొనే వ్యూహం, ప్రచారంలో జనంలోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షులతో పాటు సీనియర్లు హాజరయ్యారు.

హుజురాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్యను అంచనా వేస్తున్నారు. ఇతర పార్టీలు బరిలో నిలిపిన అభ్యర్థుల సామాజిక వర్గాల ఓట్ల సంఖ్యను బేరీజు వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీల వారిగా బలాబలాల ఆధారంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. తటస్త ఓటర్లను ఆకర్షించేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనే అంశాలపై కాంగ్రెస్‌ నేతలు సమాలోచనలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.