వీఆర్ఏలకు పే స్కేల్‌తో వారసత్వ ఉద్యోగాల ప్రకటనపై సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో రెవెన్యూ ఉద్యోగుల పని తీరును సీఎం కేసీఆర్ మెచ్చుకోవడం యావత్ రెవెన్యూ ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెరిగిందన్నారు.
రాబోయే రోజుల్లో రైతులు, ప్రజల సంక్షేమం కోసం రెవెన్యూ శాఖ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తుందని తెలిపారు. రెవెన్యూ శాఖ పని తీరును గుర్తించినందుకు ట్రెసా ఆనందం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. సీఎం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, నూతన రెవెన్యూ చట్టం ప్రకారం మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
ట్రెసా విజ్ఞప్తి మేరకు వీఆర్ఏలకు పూర్తి వేతనంతోపాటు వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించినందున ప్రజలకు సత్వర సేవలు అందించుటకు సరిపడా సిబ్బందిని పెంచి శాఖను పటిష్ఠం చేయాలని కోరారు. నాంపల్లిలోని భూ పరిపాలన శాఖ కమిషనర్ కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు.
ఇదీ చూడండి : అరణ్య రోదనగా, ప్రైవేట్ అధ్యాపకుల ఆకలి కేకలు..