Revanthreddy on Assembly Seats : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలు పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి రేవంత్‌రెడ్డి కండువాలు హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రేవంత్‌రెడ్డి (Revanthreddy) తెలిపారు. పార్లమెంట్‌లో నోరు తెరవకపోయినా.. 2009లో కేసీఆర్‌ను పాలమూరు జిల్లా భుజాలపై మోసిందని గుర్తుచేశారు.
ఈ క్రమంలోనే పాలమూరులో ఏ ప్రాజెక్టు కట్టినా కొల్లాపూర్ ప్రజల భూములే గుంజుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress) భూ నిర్వాసితులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు మీరు గెలిపించండని.. రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
గ్రామగ్రామాన కాంగ్రెస్ నేతలు తిరగాలని.. ప్రతి తలుపు తట్టాలని రేవంత్‌రెడ్డి సూచించారు. తిరగబడదాం.. తరిమికొడదాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తామని వివరించారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే రైతులు బ్యాంకులకు ఒక్క రూపాయి చెల్లించవద్దని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. ఈ క్రమంలోనే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
"తెలంగాణాలో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. పాలమూరులో ఏ ప్రాజెక్టు కట్టినా కొల్లాపూర్ ప్రజల భూములే గుంజుకున్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో భూనిర్వాసితులందరినీ ఆదుకుంటాం. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కన పెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 గెలిపించే బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో వంద సీట్లు గెలిపించే బాధ్యత తాము తీసుకుంటాం." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
అంతకుముందు రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. ఇరువురు సుమారు అరగంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన చంద్రశేఖర్.. ఈ నెల 18న జరిగే పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నారు.
Former Minister Chandrasekhar Resigned from BJP : 'రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరతా'