ETV Bharat / state

'నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీలు.. నేడు నిజాంను మించిన ధనవంతులు' - revanth reddy comments on trs plenary

Revanth comments on TRS Plenary: నేడు తెరాస 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న సందర్భంగా.. ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటుతో నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్​ ద్వారా విమర్శలు గుప్పించారు.

revanth tweet on trs plenary
తెరాస ప్లీనరీపై రేవంత్​ రెడ్డి కామెంట్స్​
author img

By

Published : Apr 27, 2022, 2:50 PM IST

Revanth comments on TRS Plenary: అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నేడు తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు జరుపుకొంటున్న తెరాసపై.. రేవంత్‌ రెడ్డి ట్విటర్​ వేదికగా తీవ్రంగా స్పందించారు. తెరాస అధినేత కేసీఆర్​పై ఘాటైన విమర్శలు చేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని రేవంత్​ వ్యాఖ్యానించారు.

వైభోగం వెనుక విషాదం: నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుంచి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించిందని రేవంత్​ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉందని​ ఆవేదన వ్యక్తం చేశారు. మే 6న హనుమకొండలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభ సందర్భంగా.. జిల్లాల్లో సన్నాహక సమావేశాలపై చర్చ సాగుతోంది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్‌తో రేవంత్ భేటీ అయ్యారు.

  • చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయి.

    అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణ కు గులాబీ చీడ పట్టింది.
    నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుండి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది.

    కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉంది. pic.twitter.com/n4fqbPptIt

    — Revanth Reddy (@revanth_anumula) April 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: KCR About National Politics : కేసీఆర్ నోట.... ''భారత రాష్ట్ర సమితి'

ముఖ్యమంత్రిపై ఎద్దు దాడి.. తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.