ETV Bharat / state

మరికొద్ది గంటల్లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం- అందరూ ఆహ్వానితులే - ఎల్బీస్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం

Revanth Reddy Swearing Ceremony in LB Stadium : రాష్ట్ర చరిత్రలో మరికొద్ది గంటల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 4నిమిషాలకు సీఎంతో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ప్రజా ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ప్రజలందరూ రావాలని రేవంత్‌ బహిరంగ ఆహ్వానపత్రం విడుదల చేశారు.

Revanth Oathing Programme in Dec 6
Revanth Reddy Swearing Ceremony in LB Stadium
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 9:54 PM IST

Updated : Dec 7, 2023, 6:18 AM IST

మరికొద్ది గంటల్లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం- అందరూ ఆహ్వానితులే

Revanth Reddy Swearing Ceremony in LB Stadium : రాష్ట్ర శాననసభ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 3న వెలువడిన ఫలితాల్లో 64 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ గెల్చుకోగా పార్టీ నాయకత్వం గెలిచిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌లోని హోటల్‌కు తరలించింది. సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికే అప్పగిస్తూ ఎమ్మెల్యేలు చేసిన ఏకవాక్య తీర్మానంతో ఏఐసీసీ సుదీర్ఘ కసరత్తు చేసింది. వరుస భేటీలు, ఆశావహులకు బుజ్జగింపులు, చర్చోపచర్చల తర్వాత మంగళవారం సాయంత్రం సీఎంగా రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించింది.

కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఈమెకే తొలి ఉద్యోగం

డిసెంబర్‌ 9న సోనియాగాంధీ జన్మదినం, తెలంగాణ ప్రకటన వెలువడిన రోజునే ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరుతుందని ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth reddy) పలుమార్లు ప్రకటించారు. వేదిక అదే అయినా వివిధ కారణాల రీత్యా రెండ్రోజుల ముందుగానే ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు అతిరథ మహారథులు, రాష్ట్ర ప్రజానీకం సమక్షంలో హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియం వేదికగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Revanth Oathing Programme on Dec 07 : సీఎంతో పాటు కొద్ది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ ప్రకటించిన 6గ్యారంటీల్లో ఒకదానిపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసే సూచనలున్నాయి. రేపటి ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ అహ్వానాలు పంపించింది. దిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో పాటు పలువురు ఇతర నేతలను రేవంత్‌రెడ్డి స్వయంగా ఆహ్వానించగా ఇండియా కూటమి నేతలతో పాటు మిగతా వారికి రాష్ట్ర కాంగ్రెస్‌ ఆహ్వానాలు పంపింది. ప్రజా ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ప్రజలందరూ రావాలని రేవంత్‌ బహిరంగ ఆహ్వానపత్రం విడుదల చేశారు.

హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్​ రెడ్డి - ప్రమాణస్వీకారానికి రానున్న సోనియా గాంధీ

Revanth Reddy Swearing Ceremony Guests List : రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబంగా, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి, స్టాలిన్‌, మమతా బెనర్జీ, సుఖ్విందర్‌ సింగ్‌, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకేశివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులతో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మాజీ సీఎంలు అశోక్ గహ్లోత్‌, భూపేష్ బఘెల్, అశోక్ చౌహాన్‌లను ఆహ్వానించారు.

గతంలో పార్టీ రాష్ట్ర ఇంచార్జీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మెయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్‌తో పాటు మరికొందరు పార్టీ నేతలకు తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్‌తో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్‌ జాతీయ నేతలకు ఆహ్వానాలు పంపారు. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏఐసీసీ ప్రత్యేకంగా సమన్వయం చేస్తోంది.

రాష్ట్రంలోనూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ఉన్నతాధికారులకు, మేధావులకు కాంగ్రెస్‌ ఆహ్వానాలు పంపింది. కొత్తగా ఎన్నికైన 119మంది ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్‌ పార్టీ అన్ని జిల్లాలో అధ్యక్షులకు గాంధీభవన్‌ ఆహ్వానాలు పంపింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో 300మందితో పాటు కోదండరాం, హరగోపాల్, కంచె ఐలయ్య సహా 250మంది ఉద్యమకారులను ప్రత్యేకంగా ఆహ్వానించిన కాంగ్రెస్‌ నాయకత్వం ప్రమాణస్వీకారం వేళ వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలందరికీ రేవంత్‌రెడ్డి బహిరంగ ఆహ్వానం

Last Updated : Dec 7, 2023, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.