ETV Bharat / state

Revanth Reddy Speech in Bus Yatra Parigi : తెలంగాణ ప్రజలు కేసీఆర్​ను సామాజిక బహిష్కరణ చేసే రోజు దగ్గరలోనే ఉంది : రేవంత్​రెడ్డి - తెలంగాణ రాజకీయ వార్తలు

Revanth Reddy Speech in Bus Yatra Parigi : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో త్వరితగతిన పావులు కదుపుతుంది. రాష్ట్రంలో రెండో విడతగా శనివారం నుంచి ప్రారంభమైన విజయభేరి యాత్రతో ముందుకు సాగుతోంది. వికారాబాద్ జిల్లాలో చేపట్టిన యాత్ర.. ప్రచారహోరులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరై మరింత జోరందించారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Congress Bus Yatra Planning
Revanth Reddy Speech in Bus Yatra Parigi
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 11:05 PM IST

Revanth Reddy Speech in Bus Yatra Parigi : కేసీఆర్ అధికార దాహార్తికి ప్రకటించిన దళితులకు మూడెకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్(Reservation) హామీలు ఏమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. పరిగికి గోదావరి జలాలు ఎందుకు రాలేదనికేసీఆర్​పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండో విడతగా నేడు ప్రారంభమైన కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర.. ఇవాళ సాయంత్రం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చేరుకుంది. యాత్రలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్​పై నిప్పులు చెరిగారు.

సీఎం కేసీఆర్​ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని రేవంత్ ఉద్ఘాటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ.. కాంగ్రెస్ హస్తగతమవటం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి శనిలా దాపురించందని విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ఓడిపోతే ఫామ్ హౌస్​లో పడుకుంటానంటే వదులుతామా అని మండిపడ్డారు. దోచుకున్న సొమ్మునంతా కక్కించి తీరతామని వెల్లడించారు. మైకు దొరికిందని.. కేసీఆర్ తాగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

DK Shivakumar Speech in Congress Bus Yatra : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పట్ల కృతజ్ఞత చూపాలి : డీకే శివకుమార్​

ఏం చేయాలో తెలియక చివరికి తనపై కేసీఆర్ కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్​ను సామాజిక బహిష్కరణ చేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. కాంగ్రెస్ పరిగి నియోజక అభ్యర్థి.. రామ్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రేవంత్ కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. ఆరు గ్యారంటీలను(Six Guarantees) అమలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు.

DK Shiva Kumar Speech in Bus Yatra Parigi : రెండో విడత బస్సు యాత్ర ప్రచారహోరులో భాగమై పరిగిలో ప్రసంగించిన.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. సీఎం కేసీఆర్​కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామో.. లేదో చూపిస్తాం రండని సవాల్ చేశారు. ఎప్పుడు వస్తారో చెప్పాలని.. బస్సులో తీసుకెళ్లి నిరూపించడానికి తాను సిద్ధమంటూ శివకుమార్ స్పష్టం చేశారు.

Congress Election Campaign in Telangana 2023 : ప్రచార బరిలోకి దిగిన కాంగ్రెస్​ అభ్యర్థులు.. ఒక్క ఛాన్స్​ ఇవ్వాలంటూ ప్రజల్లోకి..

కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేసినట్లే.. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని డీకే ధీమా వ్యక్తం చేశారు. పరిగి నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్​ను గెలిపించి తల్లి సోనియమ్మ(Sonia gandhi) రుణం తీర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Congress Bus Yatra Planning : బస్సు యాత్రలో భాగంగా ఆదివారం సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారం చేయనున్నారు.

Ticket Clashes in Telangana Congress : రెండో జాబితా తెచ్చిన తంటా.. కాంగ్రెస్​కు కొత్త తలనొప్పి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.