Revanth Reddy on Wrestlers Protest: శాంతియుతంగా ధర్నా చేస్తున్న రెజ్లర్ల పట్ల గత రాత్రి దిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒలింపిక్ విజేత, ఇతర రెజ్లర్‌లపై దిల్లీ పోలీసులు.. అర్ధరాత్రి దురుసుగా ప్రవర్తించిన తీరును ట్విట్టర్ వేదికగా ఆయన ఖండించారు. మహిళా సాధికారతపై బీజేపీ బూటకపు మాటలు చెబుతోందని ఆయన ఆరోపించారు.
ఆందోళనకారులపై ప్రభుత్వం తన బలాన్ని ప్రయోగిస్తుందని.. అదే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఎంపీపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతోందని ప్రశ్నించారు. పతకాలు తెచ్చి.. దేశం గర్వించేలా చేసినందుకు ప్రభుత్వం ఇస్తున్న రివార్డ్‌గా ఈ పోలీసుల తీరును భావించాలా.. అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
మహిళా సాధికారతపై బీజేపీ బూటకపు మాటలు చెబుతోంది. ఆందోళనకారులపై ప్రభుత్వం తన బలాన్ని ప్రయోగిస్తుంది. అదే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఎంపీపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతోంది. పతకాలు తెచ్చి.. దేశం గర్వించేలా చేసినందుకు ప్రభుత్వం ఇస్తున్న రివార్డ్‌గా ఈ పోలీసుల తీరును భావించాలా. - ట్విటర్లో రేవంత్‌రెడ్డి
-
🔥While the BJP is faking on women empowerment, an Olympic medalist and other wrestlers are manhandled by Delhi police at Midnight.
— Revanth Reddy (@revanth_anumula) May 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🔥The Govt is using force on the protestors but doing nothing on the sexual harassment accused MP!
🔥Is this the reward for bringing medals &… pic.twitter.com/jMmbXP5diD
">🔥While the BJP is faking on women empowerment, an Olympic medalist and other wrestlers are manhandled by Delhi police at Midnight.
— Revanth Reddy (@revanth_anumula) May 4, 2023
🔥The Govt is using force on the protestors but doing nothing on the sexual harassment accused MP!
🔥Is this the reward for bringing medals &… pic.twitter.com/jMmbXP5diD🔥While the BJP is faking on women empowerment, an Olympic medalist and other wrestlers are manhandled by Delhi police at Midnight.
— Revanth Reddy (@revanth_anumula) May 4, 2023
🔥The Govt is using force on the protestors but doing nothing on the sexual harassment accused MP!
🔥Is this the reward for bringing medals &… pic.twitter.com/jMmbXP5diD
చేయిచేసుకోవడం సిగ్గుచేటు..: ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం స్పందించారు. మహిళా రెజ్లర్లపై పోలీసులు చేయి చేసుకోవడం సిగ్గు చేటని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశ వనితలపై దాడులకు పాల్పడటానికి బీజేపీ ఎన్నడూ వెనకాడదని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం ఇచ్చే బేటీ బచావో-బేటీ పడావో నినాదం కేవలం మాటలకే పరిమితం అని రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు.
ఇటీవల మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించి.. రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు. ట్విటర్ వేదికగా వారికి సంఘీభావం తెలిపారు. "ఈ ఒలింపిక్ ఛాంపియన్‌లు మన దేశానికి కీర్తిని తెచ్చినప్పుడు మనం సంబురాలు చేసుకున్నాం. ఇప్పుడు వారు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ సమయంలో వారికి మనం అండగా నిలవాలి. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి.. వారికి న్యాయం చేయాలి" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అత్యంత ప్రతిభ గల అథ్లెట్లు దేశంలో ఉన్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రెజ్లర్ల సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. ప్రపంచ స్థాయిలో మన అథ్లెట్లు గుర్తింపు పొందారని ఆమె ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: