ETV Bharat / state

KTR లీగల్ నోటీసులు.. రేవంత్​ ఏడు పేజీల సమాధానం.. - Revanth Reddy responds to KTR legal notices

Revanth Reddy Counter to KTR Legal Notices: మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులపై రేవంత్​రెడ్డి స్పందించారు. తనపై లీగల్ నోటీసు వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని ఆయన వివరించారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Apr 8, 2023, 7:38 PM IST

Updated : Apr 8, 2023, 7:47 PM IST

Revanth Reddy Counter to KTR Legal Notices: టీఎస్​పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ.. రెేవంత్​రెడ్డి, బండి సంజయ్​లకు.. మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. తనపై ఆరోపణలపై వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నోటీసులపై తాజాగా రేవంత్​రెడ్డి స్పందించారు.

తనపై లీగల్‌ నోటీసును వెనక్కి తీసుకోకపోతే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. గత నెల 28న ఆయనకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ప్రతిగా రేవంత్​రెడ్డి కేటీఆర్​కు ఏడు పేజీల సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే మీ క్లయింట్ సరైన వివరాలు మీకు అందించలేదని కేటీఆర్​ను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియో సక్రమంగా వినినట్లు లేదని లేఖలో రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదని.. ఈ దేశంలో లేనందున ఆ బాధ ఆయనకు తెలియదన్నారు. టీఎస్​పీఎస్సీ ఉద్యోగాల విషయంలో.. నిరుద్యోగుల తరఫున మాట్లాడానని తెలిపారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్​కు సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీ శాఖ అందిస్తుందని అన్నారు. అలాంటప్పుడు కేటీఆర్‌ తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగిందని వివరించారు.

కేటీఆర్ పరువు ఖరీదు రూ.100కోట్లా?: కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్​ స్పందించారు. మంత్రి ఉడుత బెదిరింపులకు భయపడేది లేదని పేర్కొన్నారు. లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడతానని వివరించారు. ఈ క్రమంలోనే క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ పరువు ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తారని.. తనకు లీగల్ నోటీసు జారీ చేసినట్లు వచ్చిన వార్తను పత్రికల్లో చూసినట్లు పేర్కొన్నారు. ఆయన పరువు ఖరీదు రూ.100 కోట్లా అని ప్రశ్నించారు.

ఇందులో భాగంగానే యువత భవిష్యత్ మూల్యమెంతో మంత్రి కేటీఆర్‌ చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. లీకేజీలో తన కుట్ర ఉందని కేటీఆర్‌ ఆరోపించారని.. వాటిపై తాను ఎన్ని కోట్లకు దావా వేయాలని వ్యాఖ్యానించారు. పరువు నష్టం పేరుతో కూడా ఆయన డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శించారు.

ఇవీ చదవండి: రేవంత్​రెడ్డి బండి సంజయ్‌పై రూ100 కోట్ల పరువు నష్టం లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

KTR నోటీసులపై బండి సంజయ్ స్పందన ఆయన పరువు ఖరీదు రూ100కోట్లా

కేంద్రమే ఏ విషయంలోనూ రాష్ట్రానికి సహకరించడం లేదు: హరీశ్​రావు

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్.. మధ్యాహ్నం 2గంటల వరకే పని.. తర్వాత ఇంటికే!

Last Updated : Apr 8, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.