ETV Bharat / state

తెలంగాణ సెంటిమెంట్‌తో- ఎన్నికల్లో లబ్ధికి కేసీఆర్‌ పన్నాగాలు : రేవంత్‌ - ఓటు వేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Reacts on Nagarjuna Sagar Issue : ఏపీ పోలీసులు అర్ధరాత్రి నాగర్జున సాగర్​ దగ్గర దాడి చేసిన ఘటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి స్పందించారు. సెంటిమెంట్​ ఉపయోగించుకుని సీఎం కేసీఆర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి సాగర్ 13వ​ గేటు దగ్గరకు ఏపీ పోలీసులు రావడాన్ని తీవ్రంగా ఖండించారు.

Gutta Sukhendar React on Nagarjuna Sagar Issue
Revanth Reddy React on Nagarjuna Sagar Issue
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 12:51 PM IST

Updated : Nov 30, 2023, 1:18 PM IST

తెలంగాణ సెంటిమెంట్‌తో లబ్ధికి కేసీఆర్‌ పన్నాగాలు రేవంత్‌

Revanth Reddy Reacts on Nagarjuna Sagar Issue : తెలంగాణ పోరాటం సెంటిమెంట్​ను ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీఎం కేసీఆర్ పన్నాగాలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్​ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు(Revanth Reddy Casted Vote). అనంతరం అర్ధరాత్రి జరిగిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఘటనపై స్పందించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. పోలింగ్ రోజున ఇలాంటి ఘటనలకు తెరలేపడం అంటే.. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని విమర్శించారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత- ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వాగ్వాదం

Revanth Reddy Comments on KCR : తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ సాగర్​ జలాల సమస్య పరిష్కరించకపోవడం వల్లే.. నాగార్జున సాగర్​(Nagarjuna Sagar Issue Today)పై ఏపీ పోలీసులు దాడి చేశారని రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజా ఆమోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడే.. ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంటున్న తరుణంలో.. రాష్ట్రాల మధ్య పంపకం పెద్ద సమస్య కాదని పేర్కొన్నారు.

"తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవారు.. ప్రస్తుత సమస్యను అర్థం చేసుకోగల్గుతారు. ఎందుకు? ఎవరు? ఏం ఆశించి ఇలా చేస్తున్నారనేది కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగానే అర్ధరాత్రి దాడి చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదిన్నర సంవత్సరాలు అయింది. నాగార్జున సాగర్​ ప్రాజెక్ట్​ ఎక్కడికీ వెళ్లదు.. ఆ గేట్లూ ఎక్కడికీ పోవు.. నీళ్లూ అక్కడే ఉంటాయి. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినంత వరకు సీఈఓ బాధ్యత వహించి.. ఈ అంశంపై చర్చించాలి. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగకుండా చూడాలి. కృష్ణా, గోదావరి జలాలు.. నిధుల నియామకం తదితర వివాదాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం సమన్వయంతో పరిష్కరిస్తుంది."- రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Krishna Board orders నాగార్జునసాగర్ నుంచి తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణా బోర్డు

Gutta Sukender on Nagarjuna Sagar Issue : అర్ధరాత్రి ఏపీ పోలీసులు.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపైకి దండయాత్రలా వచ్చారని.. ఎన్నికల సమయంలో ఇది మంచి పద్ధతి కాదని శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున కాలనీలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం అర్ధరాత్రి ఏపీ పోలీసుల దాడి చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ జలాల(Krishna River Water Issue)కు సంబంధించి.. విభజన చట్టంలో స్పష్టంగా ఉందని.. ఎవరి దామాషా ప్రకారం వారు నీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఆంధ్ర పోలీసులు ప్రాజెక్టు 13వ గేటు వరకు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

KRMB Meeting Update : వర్చువల్​గా కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం.. హాజరుకాని తెలంగాణ ఈఎన్​సీ

Last Updated : Nov 30, 2023, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.