ETV Bharat / state

రేవంత్ పాదయాత్ర.. నేతలంతా ఐక్యంగా పాల్గొనాలన్న మాణిక్​ రావు ఠాక్రే - Revanth Reddy Padayatra from Bhadrachalam

Revanth Reddy Padayatra: కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరు కాకుంటే పార్టీ నుంచి తొలిగించే దిశలో చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. వరుసగా మూడు సార్లు గైర్హాజర్​ అయితే.. వివరణ కోరాలని తీర్మానించారు. ఈ మేరకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో.. పార్టీకి నష్టం కలిగించేట్లు మీడియా ముందు మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు చేపట్టబోవు హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Jan 21, 2023, 5:47 PM IST

Updated : Jan 21, 2023, 8:31 PM IST

రేవంత్ పాదయాత్ర.. నేతలంతా ఐక్యంగా పాల్గొనాలన్న మాణిక్​ రావు ఠాక్రే

Revanth Reddy Padayatra: రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరు నెలలపాటు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రపై.. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. పలువురు నాయకులు పాదయాత్రకు అనుకూలంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పటికీ.. తాత్కాలికంగా ఆ విషయంపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు. భద్రాచలం నుంచి ఆదిలాబాద్‌ వరకు.. 126 రోజులపాటు పాదయాత్ర చేయడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు రేవంత్​రెడ్డి ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.

అయితే ఈ విషయం తెలియగానే.. పలువురు సీనియర్​లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాదయాత్ర నిర్వహించినట్లయితే అది ఒక వ్యక్తి ప్రచారంగా అవుతుందని అభ్యంతరాలు వెల్లడించారు. రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా ఈ విషయాన్ని పక్కన పెట్టారు. హాథ్‌సే హాథ్‌ జోడోఅభియాన్‌ యాత్ర మాత్రమే పరిమితమయ్యారు. అదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

వారిపై వేటు తప్పదు: జనవరి 26వ తేదీన హాథ్‌సే హాథ్‌ జోడోఅభియాన్‌ యాత్రను లాంఛనంగా ప్రారంభించాలని పీసీసీ నిర్ణయించింది. ఆ తరువాత కేంద్ర బడ్జెట్‌, రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని.. ఫిబ్రవరి 6 నుంచి.. రెండు నెలలపాటు జోడో అభియాన్‌ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు రేవంత్​రెడ్డి వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా రాహుల్‌ జోడో యాత్ర సందేశాన్ని.. ప్రతి గడపకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. వరుసగా మూడు సార్లు పీసీసీ సమావేశాలకు రాకుంటే వివరణ కోరతామని.. ముఖ్యమైన సమావేశాలకు గైర్హాజరైతే పార్టీపరంగా చర్యలు తప్పవని రేవంత్​రెడ్డి హెచ్చరించారు.

తానెవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదు: మరోవైపు అంతకు ముందు విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్​ రావ్‌ ఠాక్రే.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. తానెవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తాను అధిష్ఠానం ప్రతినిధి అని తెలిపారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని వివరించారు.

అంతా ఐక్యంగా పని చేయాలి: హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో....రేవంత్​రెడ్డి 50 నియోజక వర్గాలల్లో, మిగిలిన సీనియర్‌ నాయకులు 20 నుంచి 30 నియోజక వర్గాలల్లో పాల్గొంటారని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. పార్టీకి నష్టం కలిగించేట్లు మీడియాకు వెల్లొద్దని.. ఏ సమస్య వచ్చినా తనతో మాట్లాడొచ్చని నాయకులకు పిలుపునిచ్చారు. అంతా ఐక్యంగా పని చేస్తే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని మాణిక్​ రావు ఠాక్రే అభిప్రాయపడ్డారు.

రేపు నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ: బీఆర్‌ఎస్‌ నాయకులు తమపై దాడి చేస్తే.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులపైనే నాగర్‌ కర్నూల్‌ పోలీసులు కేసు నమోదు చేశారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. ఈ కేసులో పేర్కొన్న మహిళనే.. తాను కేసు పెట్టలేదని చెప్పినా ప్రయోజనం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై జరిగిన దాడుల దృష్ట్యా రేపు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్​ రావ్‌ ఠాక్రేతో పాటు ముఖ్య నేతలంతా హాజరవుతారని రేవంత్​రెడ్డి తెలిపారు.

ఫిబ్రవరి 6న భద్రాచలంలో భారీ బహిరంగ సభ: ఫిబ్రవరి 6న భద్రాచలంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరవుతారని రేవంత్​రెడ్డి తెలిపారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విస్తృత స్థాయి సమావేశంలో ప్రస్తావించారు. ఇది వ్యక్తులకు సంబంధించిన అంశంపై.. సమావేశం కాదని రేవంత్​రెడ్డి జోక్యం చేసుకోవడంతో.. అంతటితో ఈ వ్యవహారం ఆగిపోయింది. సాయంత్రం మహిళా కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, ఐఎన్‌టీయూసీ, సేవాదళ్‌ విభాగాలతో సమావేశం నిర్వహించారు.

"ఈనెల 26న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తాం. ప్రియాంక లేదా సోనియాగాంధీ ఒక రోజు యాత్రలో పాల్గొనేలా తీర్మానం చేశాం. ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర మొదలవుతుంది. భద్రాచలం నుంచి నేను యాత్ర మొదలు పెడతా. ఠాక్రే సమావేశానికి 3 సార్లు రానివారి నుంచి వివరణ తీసుకుంటాం. కీలక సమావేశాలకి హాజరుకాని వారిని పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటాం. - రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి: రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

'ఆ దాడి అంతా డ్రామా.. నిందితుడు ఆప్ కార్యకర్తే'.. భాజపా ఆరోపణ.. స్వాతి ఫైర్!

Last Updated : Jan 21, 2023, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.