ETV Bharat / state

Revanth Reddy Open Letter to CM KCR : బీసీ కుల గణన వెంటనే చేపట్టాలి.. సీఎం కేసీఆర్‌కు.. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ - బీసీ కులగణన చేపట్టాలని కేసీఆర్‌కు రేవంత్ లేఖ

Revanth Reddy Open Letter to CM KCR : సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలన్నారు. బీసీ కుల గణన విషయంలో కాంగ్రెస్ మద్దతు ప్రకటించిందని లేఖలో పేర్కొన్నారు.

Revanth Reddy
Revanth Reddy Open Letter to CM KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 7:12 PM IST

Revanth Reddy Open Letter to CM KCR : తెలంగాణలో బీసీ కుల గణన చేయాలని ఉన్న డిమాండ్‌ను వెంటనే చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కేవలం బీసీ కుల గణన తర్వాతే వారికి న్యాయం జరుగుతుందని.. తక్షణమే బీసీ కుల గణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

బీసీ కుల గణన తర్వాతే అప్పుడే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా కావాల్సిన వాటా దక్కుతుందని ఆశిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని లేఖ ద్వార తెలిపారు. తెలంగాణలో బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్‌ ఉందని వివరించారు. దీనికి కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందన్నారు. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతి నిరసనకి, ఉద్యమానికి హస్తం పార్టీ అండగా నిలిచిందని తెలిపారు.

తెరాస, భాజపా ఒక్కటేనంటూ రేవంత్​ బహిరంగ లేఖ

మహిళా బిల్లు పార్లమెంటులో ఆమోదించిన సమయంలో కూడా మా పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఈ అంశాన్ని ప్రస్తావించారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా.. బిహార్‌ రాష్ట్రంలో బీసీ కుల గణనను విజయవంతంగా చేపట్టిందని లేఖ ద్వారా గుర్తు చేశారు. దానికి సంబంధించిన వివరాలు కూడా విడుదల చేశారని తెలిపారు. కేవలం బీసీ కుల గణనతోనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో బీసీ కుల గణనతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 16 ప్రకారం వారికి విద్య, ఉద్యోగాల్లో కల్పించిన రిజర్వేషన్‌ మరింత కట్టుదిట్టంగా అమలు చేసే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.

Revanth Reddy Letter On BC Enumeration To CM KCR : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ కుల గణన డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీసీనని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ.. ఇప్పుడు బీసీల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు. బీసీలకు ఎంతో మేలు చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప మీ ప్రభుత్వం చేసింది శూన్యం అని ఎద్దేవా చేశారు. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్నా మాట కేవలం మాటలుగా మిగిలిపోయాయని మండిపడ్డారు. తక్షణమే బీసీ కుల గణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయట పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. అప్పుడే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా కావాల్సిన వాటా దక్కుతుందని తెలిపారు.

కేసీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ...

Revanth Reddy On Urea Shortage Telangana : 'కేసీఆర్ సాబ్.. యూరియా కొరత లేకుండా చూడండి'

ప్రాజెక్టుల పేరుతో అరాచకాలా?.. సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.