RevanthReddy Meet Ponguleti Srinivas Reddy : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇందుకు బలం చేకూర్చేలా తాజాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఆయనతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించారు. ఇదే సమయంలో ఇరువురూ అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో జూమ్‌లో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే పార్టీలో చేరిక తేదీలపై ముగ్గురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ భారత్ వచ్చిన తర్వాత నేరుగా భేటీ అయిన తర్వాత బహిరంగ సభలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
BRS Leaders To Join In Congress : మరోవైపు కాంగ్రెస్‌లో చేరికల జోష్ కన్పిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ, భారత్ రాష్ట్ర సమితి ముఖ్య నాయకులను హస్తం గూటికి రప్పించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల చివరి వారంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి , పట్నం మహేందర్‌రెడ్డిలు కూడా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Joinings in Telangana Congress : ఈ క్రమంలోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని శుక్రవారం ఉదయం స్వయానా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదివారం రోజున గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరుకాకుండా హస్తం నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన నాయకులను ఘర్‌వాపసి పేరుతో తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా.. తిరిగి హస్తం పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీని కలిసినప్పుడు కూడా రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావన తీసుకురాగా రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో చర్చించాలని ఆమె సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా ఏఐసీసీ పెద్దలను తరచూ కలుస్తున్నట్లు తెలుస్తోంది. నెలాఖరున సభలు నిర్వహించి చేరికలు పూర్తయితే పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వస్తుందని, ఎన్నికల సమయానికి కొత్త చేరికలు క్యాడర్‌లో జోష్ నింపుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి: