ETV Bharat / state

Revanth Reddy Letter to CM KCR : 'ఒక్క సంతకంతో రెగ్యులర్ చేస్తామన్న హామీ ఏమైంది?' - పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలన్న రేవంత్

Revanth Reddy Letter to CM KCR : సీఎం కేసీఆర్​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేవంత్​ లేఖలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ వైఖరి గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక భూమిక పోషించారని పేర్కొన్నారు. 2014 టీఆర్ఎస్(బీఆర్ఎస్) మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారన్నారు. కానీ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వేతలు తీరలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Revanth Reddy Open Letter to CM KCR
Revanth Reddy Letter to CM KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 3:54 PM IST

Revanth Reddy letter to CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(TPCC President Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల(Contract Junior Lecturers) వేతనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ వైఖరిని గురించి లేఖలో రేవంత్​ ప్రస్తావించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్​ లెక్చరర్లు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని.. అంతా సర్కార్ ఉద్యోగులే ఉంటారని ఎద్దేవా చేశారు.

Revanth Reddy Demand to Pay Salaries to Contract Junior Lecturers : సమైక్య పాలకులు కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టారన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్​ చేస్తా అని తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్​ సర్కార్ చాలాసార్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అంతేకాకుండా 2014 టీఆర్ఎస్(బీఆర్ఎస్) మెనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారన్నారు. ఆశించినట్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ, కాంట్రాక్ట్​ జూనియర్​ లెక్చరర్ల కష్టాలు మాత్రం తీరలేదని ఆరోపించారు.

  • 🔥మాటలు చెప్పడంలో కేసీఆర్ మొనగాడు.
    మాట నిలబెట్టుకోవడంలో అధముడు.

    బంగారు తెలంగాణలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ఐదు నెలలుగా జీతాలే లేవు.

    తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగే ఉండడన్న హామీకి అతీగతీ లేదు.#KCRFailedTelangana #ByeByeKCR pic.twitter.com/FHQrzIUHWi

    — Revanth Reddy (@revanth_anumula) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Contract Junior Lecturers Salary Problems : క్రమబద్ధీకరణ జరగకపోగా.. 'జీతాలివ్వండి మహాప్రభో' అని అర్ధించాల్సిన పరిస్థితి రాష్ట్ర పాలనలో దాపురించిందని విమర్శించారు. మే నెలలో రెగ్యులర్​ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏప్రిల్ నెల జీతం ఇంకా రాలేదని ఆరోపించారు. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు కొన్ని జిల్లాల్లో జీతాలు పెండింగ్​లోనే ఉన్నాయన్నారు. విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నా.. సకాలంలో నెలలుగా జీతాలు లేక వందలాది మంది అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు.

Congress PEC Meeting at Gandhi Bhavan : అతి త్వరలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా.. బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట: రేవంత్​రెడ్డి

Revanth Reddy Demanded to Pay Salary of Junior Lecturers : నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారి, ఈఎంఐలు సకాలంలో కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వారంతా అప్పలపాలవుతున్నారని మండిపడ్డారు. వాటిని సకాలంలో చెల్లించలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారని తెలిపారు.

గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేవన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏ రోజు జీతం పడుతుందో కూడా తెలియని దుస్థితి నెలకొందని విమర్శించారు. ఇప్పుడు అందులోనూ ఇంకా ఐదారు నెలలుగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీతాలు పెండింగ్​లో ఉన్నాయన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే? ఇదేనా అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని చెప్పుకోవడమే తప్ప కాంట్రాక్ట్ లెక్టరర్స్​కు వేతనాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర సర్కార్ ఉందని మండిపడ్డారు.

Telangana Congress MLA Candidates List : అభ్యర్థుల వడపోత కార్యక్రమం షురూ.. కాంగ్రెస్​ లిస్ట్​ ఎప్పుడంటే..?

Revanth Reddy Writes Open Letter to CM KCR : దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అంటారు కదా.. మరి దేశ భవిష్యత్​ను నిర్ణయించే తరగతి గదుల్లో బోధించే లెక్చరర్లకు జీతాలు ఇవ్వకుండా వేధించడం ఏ మాత్రం క్షమార్హం కాదన్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్​ లెక్చరర్లకు సకాలంలో జీతాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని వివరించారు. లేనిపక్షంలో వారి పోరాటానికి రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ మద్దతుగా నిలవడమే కాక.. వారి తరఫున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామని తెలిపారు.

డిమాండ్లు :

  • కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ఐదారు నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలి.
  • కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ప్రతి నెల సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలి.
  • వివిధ కారణాలతో రెగ్యులరైజ్ చేయని వారిని తక్షణమే రెగ్యులర్ చేయాలి.

Revanth Reddy on Congress Declarations : 'చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించడమే మా నైజం.. కర్ణాటకలో చేశాం.. తెలంగాణలోనూ చేస్తాం'

Revanth Reddy Reaction on Jamili Elections : జమిలి ఎన్నికల వెనక పెద్ద కుట్ర.. ఇది దేశ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం: రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.