ETV Bharat / state

'కవితను, బీఎల్ సంతోశ్​ను ఎందుకు అరెస్టు చేయట్లేదు..?' - బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ విమర్శనాస్త్రాలు

Revanth reddy on MLC Kavitha: కేంద్రం ఎమ్మెల్సీ కవితను, రాష్ట్రం బీఎల్ సంతోశ్​ను ఎందుకు అరెస్టు చేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే టీఆర్​ఎస్​, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కొడంగల్‌ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్‌.. ఈ నాలుగేళ్ల కాలంలో అక్కడ ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Revanth reddy
Revanth reddy
author img

By

Published : Dec 5, 2022, 12:35 PM IST

Revanth reddy on MLC Kavitha : పాలమూరు రంగారెడ్డి తప్ప టీఆర్​ఎస్​కు ఏ ప్రాజెక్టుతో సంబంధం లేదని.. అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్‌ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న ఆయన.. కొడంగల్‌ అభివృద్ధికి నిధుల కోసం ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో బంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారు.. నాలుగేళ్ల కాలంలో కొడంగల్​లో ఏం అభివృద్ధి చేశారో కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన జరగాలన్న రేవంత్‌రెడ్డి.. లేకపోతే గ్రామగ్రామాన తిరిగి టీఆర్​ఎస్ తీరుని ఎండగడతామని హెచ్చరించారు. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించిందన్న రేవంత్‌.. టీఆర్​ఎస్​, బీజేపీ నేతలు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారన్న ఆయన... కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోశ్​ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే టీఆర్​ఎస్​, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.