ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ వేళ.. చర్చనీయంగా కాంగ్రెస్‌ నిర్ణయం - Revanth Reddyfires on KCR latest news

Congress Complaint Against 12 BRS MLAs: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఉన్న ముగ్గురు శాసనసభ్యులతోపాటు తమ పార్టీ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన మిగతా 9మందిపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మొయినాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ మారే సమయంలో ఈ 12మంది వివిధ రకాల లబ్ధి పొందినట్లు ఆరోపించిన కాంగ్రెస్.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది.

Congress Complaint Against 12 BRS MLAs
Congress Complaint Against 12 BRS MLAs
author img

By

Published : Jan 6, 2023, 3:39 PM IST

Updated : Jan 6, 2023, 7:58 PM IST

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ వేళ.. చర్చనీయంగా కాంగ్రెస్‌ నిర్ణయం

Congress Complaint Against 12 BRS MLAs: గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొంది.. ఏడాది గడవక ముందే అధికార పార్టీలో చేరిన 12 మంది శాసనసభ్యులపై మూడేళ్ల తర్వాత హస్తం పార్టీ చర్యలకు పట్టుబట్టింది. ఇందులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 చోట్ల గెలిచింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయటం.. ఉపఎన్నికల్లో ఉత్తమ్‌ సతీమణి పోటీ చేసి ఓడిపోవటంతో కాంగ్రెస్‌ బలం 18కి తగ్గింది.

వీరిలో 12 మంది ఎమ్మెల్యేలైన.. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్‌ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ,.. మహేశ్వరం శాసనసభ్యురాలు సబితాఇంద్రారెడ్డి, పాడేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,.. కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి,.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి.. 2019 జూన్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. అదే సమయలో సీఎల్పీని టీఆర్​ఎస్​లో విలీనం చేయాలని శాసన సభాపతికి లేఖ అందించారు.

తామూ ఇంప్లీడ్‌ అవుతామన్న కాంగ్రెస్‌: తాజాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేశాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేయటం.. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించటంతో.. ఇందులో తామూ ఇంప్లీడ్‌ అవుతామని కాంగ్రెస్‌ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే తమ పార్టీలో గెలిచి.. పార్టీ మారిన 12మందిపై మొయినాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు నేతలు సమావేశమయ్యారు.

మొయినాబాద్‌ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు: కాంగ్రెస్‌లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు.. బీఆర్​ఎస్​లో చేరినందుకు.. వారికి కలిగిన రాజకీయ, ఆర్థిక లబ్ధిపై సవివరంగా ఫిర్యాదు చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం.. పార్టీ నేతలతో రేవంత్‌రెడ్డి మొయినాబాద్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర కేసు మొయినాబాద్‌లో నమోదు అయినందున.. అదే పోలీస్​స్టేషన్‌లో ఈ 12మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిర్యాదు చేశారు.

న్యాయస్థానం తలుపు తట్టాలని భావిస్తున్న కాంగ్రెస్: ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో ఉన్న నలుగురు శాసనసభ్యుల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి బీఆర్​ఎస్​లోకి వెళ్లిన వారే కాగా.. మిగిలిన వారిపైనా విచారణ జరిపేందుకు వీలుగా ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అదేవిధంగా ఈడీ కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విచారణకు స్వీకరించకుంటే తిరిగి న్యాయస్థానం తలుపు తట్టాలని భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ.. పార్టీ మారిన శాసనసభ్యులపై మూడేళ్ల తర్వాత చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ కోరుతుండటం ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ప్రయోజనం పొందడానికా... లేదంటే తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్న బీఆర్​ఎస్​ను ఇరుకున పెట్టేందుకా.. అనే అంశం చర్చనీయంగా మారింది.

"ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ పట్ల చూపించిన అభిమానాన్ని కొందరు అమ్ముకున్నారు. కొంతమంది మంత్రి పదవులు, విప్​లు, ఛైర్మన్​ల పదవులు, కాంట్రాక్టులు తీసుకున్నారు. మొత్తం 12మంది 2019 నుంచి వివిధ సందర్భాలలో పార్టీ ఫిరాయించారు. ఆర్థిక ప్రయోజనాలు పొందారు. అందుకే వారి మీద ఫిర్యాదు చేశాం. మేమిచ్చిన ఆధారాలు పరిశీలించి విచారణ చేపట్టాలి. పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరగాలి." - రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి: ఆ 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు

దిల్లీ అంజలి హత్య కేసులో మరొకరు అరెస్ట్.. నిధిపై ప్రశ్నల వర్షం

Last Updated : Jan 6, 2023, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.