ETV Bharat / state

ప్రధానిని ప్రశ్నించడానికి ముఖ్యమంత్రికి భయమెందుకు?: రేవంత్‌రెడ్డి - revanth reddy fires on cm kcr

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రధానిని ప్రశ్నించడానికి సీఎం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

Revanth reddy fires on bjp
ప్రధానిని ప్రశ్నించడానికి ముఖ్యమంత్రికి భయమెందుకు?: రేవంత్‌రెడ్డి
author img

By

Published : Jul 27, 2022, 7:56 PM IST

రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు అలమటిస్తుంటే...కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని కాంగ్రెస్‌ విమర్శించింది. దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేవలం వ్యక్తిగత పనులకే పరిమితమయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఆరోపించారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదించడంలోనూ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అఖిలపక్ష ఎంపీలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.

ప్రధానిని ప్రశ్నించడానికి సీఎం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇతర పార్టీల వెనక ఉండి పోరాడుతున్నట్లు మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో వర్షాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయట్లేదని మండిపడ్డారు.

ప్రధానిని ప్రశ్నించడానికి ముఖ్యమంత్రికి భయమెందుకు?: రేవంత్‌రెడ్డి

తెలంగాణ వర్షాలపై కేంద్రం, ప్రధానిని ఎందుకు ప్రశ్నించట్లేదు? మిగతా పక్షాల వెనక ఉండి పోరాడుతున్నట్లు నటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నివేదికలపై కాలయాపన చేస్తోంది . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో నష్టాన్ని అంచనా వేయాలి. తెలంగాణలో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. - రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇదీచూడండి: వరదలో బైక్‌తో సహా చిక్కుకున్న వ్యక్తి.. కాపాడిన పోలీసులు.. సీపీ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.