Revanth Reddy Fires on KCR and KTR: అకాల వర్షం కారణంగా తెలంగాణలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందొచ్చిన పంట మొత్తం నీటిపాలైంది. ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే..అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీల పేరుతో..రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారని ఘాటు విమర్శలు గుప్పించారు. 'వీళ్లకు ఏమైనా మానవత్వం ఉందా..బాధ్యత ఉందా.. ఇది ప్రభుత్వమేనా?' అని ప్రశ్నించారు. రైతు - యువత ఏకమై బీఆర్ఎస్ను బొందపెట్టే సమయం త్వరలోనే వస్తుందని చెప్పుకొచ్చారు.
-
అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి
— Revanth Reddy (@revanth_anumula) April 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే...
అయ్యా ఔరంగాబాద్ లో..
కొడుకు ప్లీనరీల పేరుతో..
రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారు.
వీళ్లకు మానవత్వం ఉందా...
బాధ్యత ఉందా... ఇది ప్రభుత్వమేనా... ?
రైతు - యువత ఏకమై బీఆర్ఎస్ ను బొందపెట్టే సమయం… pic.twitter.com/90Bbn0hchw
">అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి
— Revanth Reddy (@revanth_anumula) April 26, 2023
రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే...
అయ్యా ఔరంగాబాద్ లో..
కొడుకు ప్లీనరీల పేరుతో..
రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారు.
వీళ్లకు మానవత్వం ఉందా...
బాధ్యత ఉందా... ఇది ప్రభుత్వమేనా... ?
రైతు - యువత ఏకమై బీఆర్ఎస్ ను బొందపెట్టే సమయం… pic.twitter.com/90Bbn0hchwఅకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి
— Revanth Reddy (@revanth_anumula) April 26, 2023
రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే...
అయ్యా ఔరంగాబాద్ లో..
కొడుకు ప్లీనరీల పేరుతో..
రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారు.
వీళ్లకు మానవత్వం ఉందా...
బాధ్యత ఉందా... ఇది ప్రభుత్వమేనా... ?
రైతు - యువత ఏకమై బీఆర్ఎస్ ను బొందపెట్టే సమయం… pic.twitter.com/90Bbn0hchw
Revanth Reddy on Crop Damage in Telangana : రాష్ట్రంలో పలు జిల్లాలో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఈ అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. కల్లాల్లో, మార్కెట్లో, రోడ్లపై ఆరబోసిన ధాన్యం అంతా నీటిపాలైంది. భారీగా కురిసిన వర్షానికి రాత్రి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన పంటను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నిచోట్ల ధాన్యపు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయాయి. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం కారణంగా చేలలోని పంటలు అధికమొత్తంలో పాడైపోయాయి.
వడగళ్లు, ఈదురుగాలుల వర్షం వల్ల మామిడి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. వడగండ్ల వాన కారణంగా తీవ్రంగా వరి, మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వంద ఎకరాల్లోని వరి పంట నేలరాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తంగళ్లపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మామిడి కాయలు నేలరాలాయి. వనపర్తి జిల్లాలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగు పడి కొంతమంది మృత్యువాత పడ్డారు.
వర్షాలతో నష్టం: తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి ఆదివారం వరకు కురిసిన వడగండ్లతో కూడిన అకాల వర్షాల కారణంగా 27 జిల్లాల్లో 2,36,194 ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం కలిగిందని వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. అధికంగా జగిత్యాల జిల్లాలో రైతులకు తీవ్రంగా పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వరసగా 4 రోజులపాటు అకాల వర్షాలు కురవడం వల్ల ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేయించింది.
ఇవీ చదవండి: