Revanth Reddy Fire on BJP : హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా.. సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టీ విక్రమార్క, సీనియర్ నేతలు హనుమంతరావు, జగ్గారెడ్డి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Revanth Reddy Fires on BRS : బీజేపీ పాలనలో దేశ ప్రజల భద్రతకు మప్పు ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC President Revanth Reddy) అన్నారు. బీజేపీ సర్కార్ 'విభజించు పాలించు' విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ఆక్షేపించారు. ఏమీ చేయలేని ప్రధాని మోదీ.. దేశం పేరు మారుస్తామంటున్నారని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా అన్న ప్రధాని.. ఇండియా పేరే మారుస్తున్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
Revanth Reddy Comments On BJP and BRS : ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే.. దేశం పేరు మార్పు అని తీవ్ర రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పెరిగిన ధరలు, మణిపూర్ అంశంపై మోదీ ఎక్కడా మాట్లాడలేదని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మాట తప్పారని విమర్శించారు. అలాగే కేంద్రమంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) సైతం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్, బీజేపీ కలిసి.. కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వలేదన్నారు. తమ విజ్ఞప్తిని తిరస్కరించిన రాష్ట్ర సర్కార్.. కమలం సభకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆ రెండు పార్టీల కుట్ర రాజకీయాలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఈ నెల 17న జరిగే సోనియాగాంధీ సభకు భారీగా జనం తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
"బీజేపీ పాలనలో దేశ ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడింది. 'విభజించు పాలించు' విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఏమీ చేయలేని మోదీ దేశం పేరు మారుస్తామంటున్నారు. మేక్ ఇన్ ఇండియా అన్న మోదీ ఇండియా పేరే మారుస్తున్నారు. ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే దేశం పేరు మార్పు. పెరిగిన ధరలు, మణిపూర్ అంశంపై మోదీ ఎక్కడా మాట్లాడలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ మాట తప్పారు." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
మరోవైపు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా.. సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ కుమార్తె త్రిషతో కలిసి పాదయాత్ర చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు పార్టీ జెండాలతో జై కాంగ్రెస్ అని హోరెత్తించారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో మాజీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల్లో ర్యాలీ చేపట్టిన.. కార్యకర్తలు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) చేపట్టిన జోడో యాత్రతో శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపిందని వారు పేర్కొన్నారు.
Revanth Reddy Letter to CM KCR : 'ఒక్క సంతకంతో రెగ్యులర్ చేస్తామన్న హామీ ఏమైంది?'