ETV Bharat / state

పరీక్షల రద్దు మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: రేవంత్‌రెడ్డి - కేసీఆర్‌పై విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి

Malluravi Complained to CBI About Paper Leakage: పరీక్షల రద్దు మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును దర్యాప్తు చేయాలని సీబీఐకు మల్లు రవి వినతిపత్రం సమర్పించారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Apr 4, 2023, 5:13 PM IST

Malluravi Complained to CBI About Paper Leakage: సీఎం కేసీఆర్​ పాలన గాలికొదిలి.. రాజకీయ విధ్వంసంలో మునిగిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. దిల్లీలో పార్టీ కార్యాలయంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలనను పట్టించుకోకపోవడం వల్లే.. ఇప్పుడు ప్రశ్నాపత్రాలు లీకేజీలు అవుతున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేతపట్టిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో.. ఎస్​ఎస్​సీ బోర్డు నుంచి టీఎస్​పీఎస్సీ బోర్డు వరకు అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక ఇప్పుడు పరీక్షలను రద్దు చేయకూడదని.. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే రద్దు చేయాలని రేవంత్​రెడ్డి సూచించారు.

మరోవైపు టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసును దర్యాప్తు చేయాలని సీబీఐకు కాంగ్రెస్​ నేత మల్లు రవి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​లోని కోఠి ప్రాంతంలో ఉన్న సీబీఐ కార్యాలయంలో వారిని కలిసి.. మల్లు రవి వినతిపత్రం అందించారు. వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్లకు నోటిఫికేషన్లు ఇస్తే.. అవి వచ్చాయని సంతోషపడేలోపే.. లీకేజీలు జరుగుతున్నాయని బాధపడ్డారు. ఈ పేపర్‌ లీకేజీలతో నిరుద్యోగులు ఏమి చేయాలో తెలియక అయోమయం స్థితిలో ఉన్నారని ఆవేదన చెందారు.

గ్రూప్‌-1 సహా ఇంకా మరికొన్ని పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే ఉన్నారని మల్లు రవి తెలిపారు. విద్యార్థి నాయకులు ధర్నాలు చేశారని వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టారని మండిపడి.. వెంటనే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకులను మల్లు రవితోపాటు కోదండరెడ్డి, రోహిన్ రెడ్డి, బెల్లయ్య నాయక్‌, అద్దంకి దయాకర్ ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించారు. పదవ తరగతి పరీక్ష పత్రం లీక్‌ విషయంలో ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయంపై దాడి చేశారంటూ.. నమోదు చేసిన కేసులో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నేత బలమూరి వెంకట్‌తోపాటు పలువురిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌పై పంపారు. ఈ విద్యార్థి నాయకులను కాంగ్రెస్‌ నేతలు పరామర్శించారు.

"పరీక్షా పేపర్ల లీకులను అరికట్టలేని ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఈ పేపర్‌ లీకేజీ కేసులో పెద్దలను కాపాడేందుకే సిట్‌ వేశారు. అందులో సందేహమే లేదు. టీఎస్‌పీఎస్సీలో సభ్యులుగా కొత్త వాళ్లను నియమించిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలి. ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలి." - మల్లు రవి, కాంగ్రెస్‌ నేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.