తెరాస నేతలు, పోలీసులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు (Revanth complained to EC) చేశారు. ఈ మేరకు ఆయన నిరోష అనే యువతితో కలిసి కంప్లైంట్ చేశారు. తెరాస నేతలు, పోలీసులు నిరోషపై దాడి చేశారని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల గురించి సభలో అడిగినందుకు దూషించి, దాడి చేశారని పేర్కొన్నారు.
అండగా ఉంటా...
పోలీసులు తనపై దాడి చేయడంతోపాటు దుర్భాషలాడరని ఆరోపిస్తున్న నిరోషతో అంతకముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని కోరారు. ఈరోజు నిరోషను హైదరాబాద్‌కు రావల్సిందిగా చెప్పిన రేవంత్ రెడ్డి... ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేయడానికి తను కూడా వస్తానని తెలిపారు. నిరోషతో పాటు రేవంత్‌కు కూడా వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేశారు.
తెరాస సభకు వెళ్లి... ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని అడిగినందుకే తనపై పోలీసులు దాడి చేశారని ఆ మహిళ రేవంత్ రెడ్డికి వివరించింది. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి నోటికొచ్చినట్లు మహిళా పోలీసులు దుర్భాషలాడినట్లు పేర్కొంది.
ఉద్యోగం అడిగితే తెరాస వాళ్లు కొట్టించారు..
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా మారారని నిరోష ఆరోపించారు. తాను వీణవంక మండలంలో తెరాస పార్టీ సమావేశానికి వెళ్తే... పోలీసులు తనపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నిరుద్యోగ సమస్యలపై మాట్లాడటానికి వెళ్తే... తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. భాజపా తనకు 10 లక్షలు ఇచ్చినట్లు ఆరోపించారని పేర్కొన్నారు. తన దారిన తాను వెళ్తుంటే.. పోలీసులు దాడికి దిగారని ఆవేదన చెందారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆ యువతి ఆరోపించారు. మెడలో చైన్ లాగేసుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు. నిరుద్యోగ బాధలు ఎవరికి అర్థం కావడం లేదని విలపించారు.
ఇదీ చూడండి: Revanth reddy Phone call: వీణవంక బాధితురాలికి రేవంత్ రెడ్డి ఫోన్... ఏం చెప్పారో తెలుసా!