ETV Bharat / state

'ఎమ్మెల్సీ కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో తేల్చి చెప్పాలి'

Revanth Reddy Comments on TRS and BJP: భాజపా, తెరాసలు కుమ్మక్కయ్యాయని.. రెండు పార్టీల గురించి ప్రజలు చర్చించుకునేలా కుట్ర చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు ఎవరైనా ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నాయని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Revanth reddy comments on TRS AND BJP
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
author img

By

Published : Nov 18, 2022, 6:10 PM IST

గాంధీ భవన్‌ మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

Revanth Reddy Comments on TRS and BJP: ఎమ్మెల్సీ కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో తేల్చి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిట్‌ అధికారులను ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా, తెరాస పార్టీలు కుమ్మక్కయ్యాయని.. ప్రజలు రెండు పార్టీల గురించి చర్చించుకునేలా కుట్ర చేస్తున్నారన్నారు. ఈ రెండు పార్టీలు ఎవరైనా ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నాయని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని మండిపడ్డారు. రాష్ట్ర అధికారులను వాడుకుంటూ తెరాస కేసులు పెడితే, కేంద్ర సంస్థలను వాడుకుని బీజేపీ కేసులు పెడుతోందని దుయ్యబట్టారు. నేతలు, వ్యాపారులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయన్నారు.

కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరు: ఎమ్మెల్సీ కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో సిట్‌ అధికారులు తేల్చి చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనలో సీఎం కేసీఆర్‌, కవిత స్టేట్‌మెంట్లను సిట్‌ అధికారులు నమోదు చేసుకోవాలని సూచించారు. సిట్‌ అధికారి సీవీ ఆనంద్‌.. కవిత, సీఎం వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని కోరారు. బీజేపీలోకి రావాలని కవితను కోరితే ఆమె ఒప్పుకున్నారని, అలాగే కవితను బీజేపీ వాళ్లు సంప్రదించారని కేసీఆర్‌ చెప్పారన్నారు. ఈ మాటలను సుమోటోగా తీసుకుని సిట్‌ దర్యాప్తు చేయాలన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు సంప్రదించారని నేడు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారన్నారు. అయితే ఏ మాటలో దేనిలో వాస్తవం ఉంది.. రాష్ట్ర సర్కారు పాలనను గాలికి వదిలేసి రాజకీయాలకే పరిమితం అయ్యిందని మండిపడ్డారు.

ఒకసారి అమ్ముడుపోయిన వాళ్లు రెండోసారి అమ్ముడుపోలేరా: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కేసీఆర్‌ వైఖరి హాస్యాస్పదంగా ఉందని రేవంత్‌ అన్నారు. ఇప్పటికే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల మాటలు నమ్మి.. కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఒకసారి అమ్ముడుపోయిన వాళ్లు రెండోసారి అమ్ముడుపోలేరా అని ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఎలా వచ్చారో అందరికీ తెలుసని అన్నారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో బీజేపీకి సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారని నిలదీశారు.

సీఎం కేసీఆర్‌ ఉద్యోగ ప్రకటన చేసి నేటి ఏడాది కావస్తోంది: రాష్ట్రంలో వానాకాలం పంటను ఎవరు కొనే పరిస్థితి లేదని రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు మార్కెట్ల వద్ద ధాన్యంతో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఇది ప్రభుత్వం వైఫల్యాలను తెలుపుతోందన్నారు. రేపట్నుంచే 90వేల ఉద్యోగాల భర్తీ అని సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసి నేటికి ఏడాది కావస్తోందని.. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ చేసిందేమీ లేదని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో కేసీఆర్‌ వైఖరి హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల మాటలు విని సీఎం కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు తెరాసలోకి ఎలా వచ్చారో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకసారి అమ్ముడుపోయిన వాళ్లు మరోసారి అమ్ముడుపోలేరా? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భాజపాకు సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లింది? భాజపాలోకి రావాలని అడిగారని ఎమ్మెల్సీ కవిత అంగీకరించారు. ఈ ఘటనలో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత స్టేట్‌మెంట్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నమోదు చేసుకోవాలి. కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో తేల్చాలి. కవిత, సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై కూడా సిట్‌ అధికారి సీవీ ఆనంద్‌ దర్యాప్తు చేయాలి. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేయాలి. - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.