ETV Bharat / state

Revanth Reddy criticizes Dharani portal : 'ధరణి విషయంలో కేసీఆర్ పెద్ద దళారీ'

Revanth Reddy comments on Dharani portal : ధరణి సమస్యలు క్లియర్ కావాలంటే 30శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఆరోపించారు. ధరణి వచ్చాక భూదాన్ భూములు కేటీఆర్ అనుచరులకు వెళ్లిపోయాయని విమర్శించారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ధరణి రద్దు చేసి ప్రజలకు ఇబ్బందులు లేని పాలసీ తెస్తామంటే కేసీఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Jun 12, 2023, 6:08 PM IST

Updated : Jun 12, 2023, 8:08 PM IST

'ధరణి విషయంలో కేసీఆర్ పెద్ద దళారీ'

Revanth Reddy fires on KCR Dharani issue : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ భూములపై విచారణ జరిపిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ అన్నారు. ఇందులో దోషిగా ఉన్న వారికి శిక్ష వేయిస్తామని తెలిపారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ధరణి పోర్టల్​ అనేది కేసీఆర్​కి బంగారు గుడ్డు పెట్టే బాతులాగా మారిందని ఆరోపించారు. రాష్ట్ర భూముల వివరాలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేవని పేర్కొన్నారు.

Timpapur Bhudan land dispute : ధరణి రద్దు చేస్తే తమ కుట్ర బయట పడుతుందని ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ధరణి సమస్యలు క్లియర్ కావాలంటే 30శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు. ధరణి ఫిర్యాదు దారుల నుంచి వసూలు చేసే వెయ్యి రూపాయల రుసుము ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. ప్రజలు చెల్లించిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ తిమ్మాపూర్ భూములను దోచుకుంటున్నారని రేవంత్​ ఆరోపించారు. ఈ భూ కుంభకోణంలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ ఫిరాయించిన నేతలున్నారని విమర్శించారు.

కలెక్టర్లను కేటీఆర్ కీలు బొమ్మలుగా మార్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బందు, రైతు బీమా రాదని కేసీఆర్ తెలంగాణ ప్రజలని కన్ఫ్యుజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో ధరణి బాధితులు తమ ఆవేదన తెలియచేశారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. ధరణిని రద్దుచేసి ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తీసుకొస్తామని ప్రకటించారు.

తమ గ్రామ భూములపై అప్పట్లో లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. కలెక్టర్లు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని ఎందుకు లేఖ రాయడం లేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి రాసిన లెటర్ ఆయనకే కోట్ చేస్తూ ఆయనకు మరో లెటర్​ రాస్తానని రేవంత్​ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ భూదాన్ భూములపై ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ధరణిలో ఉన్నంత దోపిడీ మరెందులో లేదని పేరొన్న ఆయన.. ధరణి విషయంలో కేసీఆర్ పెద్ద దళారీ అని విమర్శించారు.

"ధరణి విషయంలో కేసీఆర్ స్వార్థం ఏ స్థాయిలో ఉందో ఆయన ఇటీవల చేస్తున్నవ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ 146.5 ఎకరాల భూదాన భూములను కొట్టేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ ఫిరాయించిన నేతలు ఉన్నారు. ఇందులో కేసీఆర్‌ కుటుంబానికి 30శాతం కమిషన్‌ వచ్చింది. తిమ్మాపూర్ భూదాన్ భూములపై ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయడం లేదు."- రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : Jun 12, 2023, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.