Revanth Reddy Comments on Alliance with BRS : తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తులుండవని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ను దరిదాపుల్లోకి కూడా రానిచ్చేది లేదని పార్టీ అధిష్ఠానం స్పష్టంగా చెప్పిందని.. బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఎలాంటి సంప్రదింపులు జరిపినా సహించేది లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని తెలిపారు. కేసీఆర్‌ది మాఫియా మోడల్ అని.. అలాంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే బీజేపీ-బీఆర్ఎస్ల మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. బీజేపీ ఇచ్చిన టాస్క్‌నే కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబ ఆస్తి ఇప్పుడు రూ.లక్ష కోట్లు అయిందని ఆరోపించిన ఆయన.. ఆ రెండు పార్టీల మధ్య సంబంధం లేకపోతే కేసీఆర్ ఆస్తులపై ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై తానే కనీసం 50 ఫిర్యాదులు చేశానని.. ఒక్క దాని మీద కూడా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు.
ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 80 సీట్లు ఇస్తారని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు 25 సీట్లలోపే వస్తాయని.. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. కేసిఆర్ కల్పించిన భ్రమల్లో నుంచి తెలంగాణ ప్రజలు బయటికి వచ్చారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తరహాలో.. కేసీఆర్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఒకవైపు వెళ్లాలని అనుకున్నప్పుడు కమ్యూనిస్టులు ఎవరి వైపు ఉంటే ఏముంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం లేదని.. కుప్పకూలిందని దుయ్యబట్టారు.
''నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బీఆర్ఎస్తో పొత్తులుండవు. కేసీఆర్‌ను దరిదాపుల్లోకి కూడా రానిచ్చేది లేదని పార్టీ అధిష్టానం స్పష్టంగా చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఎలాంటి సంప్రదింపులు జరిపినా సహించేది లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య సంబంధాలు ఉన్నాయి. సంబంధం లేకపోతే కేసీఆర్ ఆస్తులపై ఎందుకు విచారణ చేయట్లేదు. కేసీఆర్ అవినీతి మీద నేనే కనీసం 50 ఫిర్యాదులు చేశాను. ఒక్క దాని మీద కూడా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 80 సీట్లు ఇస్తారు. బీఆర్ఎస్కు 25 సీట్లలోపే వస్తాయి. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుంది.''- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు
2023 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలని భావిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పార్టీకి చెప్పానని స్పష్టం చేశారు. 6 నెలల ముందే సీట్లు ప్రకటించాలని కొందరి నుంచి సూచనలు వచ్చాయన్న రేవంత్.. ఆ అంశం పరిశీలనలో ఉందన్నారు.
ఇవీ చూడండి..
'బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం'
బీజేపీలో మున్నాభాయ్ MBBS తరహాలో చాలా మంది ఉన్నట్లున్నారు: కేటీఆర్ ట్వీట్