ETV Bharat / state

కర్ణాటకలో కాంగ్రెస్​ గెలిస్తే.. తెలంగాణలో విజయం మాదే: రేవంత్​రెడ్డి - కాంగ్రెస్​ ఆధ్వర్యంలో పోస్ట్​ కార్డుల ఉద్యమం

Revanth Reddy Challenged BJP And BRS: అబద్ధాన్ని నిజం చేయడంలో కేసీఆర్​కు మించినవాడు లేడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ట్విటర్​లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇక్కడ కూడా అధికారం తమదేనని రేవంత్​ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అదానీ, టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులపై కూడా స్పందించారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Apr 2, 2023, 8:54 PM IST

Revanth Reddy Challenged BJP And BRS: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ గెలిస్తే.. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలపై రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో సీఎం కేసీఆర్​ చర్చకు రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సవాల్​ విసిరారు. ఇక్కడ రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్నలెక్కలు ఎన్‌సీఆర్​బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

మరోవైపు గాంధీ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో.. అదానీలకు మోదీ ప్రజా ధనాన్ని దోచిపెడుతున్నారని రాహుల్​ గాంధీ ప్రశ్నించినందుకే అనర్హతవేటు వేశారని రేవంత్​ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాన్ని నిజం అనిపించేలా చెప్పడంలో కేసీఆర్​కు మించినవాడు లేడని ట్విటర్​ వేదికగా ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో రేవంత్​రెడ్డితో పాటు, రాష్ట్ర కాంగ్రెస్​ ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

పోస్టు కార్డుల ఉద్యమం: రాహుల్​ గాంధీపై బీజేపీ కక్ష కట్టిందని.. అనర్హత వేటు వేసిందని చెప్పారు. ఈ విషయంపై సమాధానం చెప్పలేకనే హుటాహుటిన రాహుల్​పై ఇలాంటి చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. అందుకు నిరసనగా రేపు సోమవారం పోస్టు కార్డు ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 8న మంచిర్యాలలో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.

గజ్వేల్​లో నిరుద్యోగ నిరసన సభ: ఈనెల 10 నుంచి 25వరకు జుక్కల్​ నుంచి తిరిగి హాథ్​ సే హాథ్​ పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 25లోపు గజ్వేల్​లో లక్ష మంది నిరుద్యోగులతో.. నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని తెలిపారు. పేపర్​ లీకేజీ విషయంలో మంత్రి కేటీఆర్​ను బర్తరఫ్​ చేయాలని.. ఇప్పుడున్న టీఎస్​పీఎస్సీ కమిషన్​ను రద్దు చేసి.. తక్షణమే కొత్త నియామకాలను చేపట్టి మిగిలిన పరీక్షలు నిర్వహించాలని హెచ్చరించారు. ఈనెల 7న కాంగ్రెస్​ ఆధ్వర్యంలో రంజాన్ నేపథ్యంలో కుతుబ్​షా మైదానంలో ఇఫ్తార్​ విందు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

"మోదీ, అమిత్​ షా సహకారంతోనే అదానీ ప్రజాధనాన్ని లూఠీ చేశారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. రాహుల్​ గాంధీ లోక్​సభలో నిల్చుని మాట్లాడితే వారి దోపిడివ్యవస్థ కుప్పకూలి రూ.11 లక్షల కోట్లు మాయమైపోయాయి. అదానీ, ప్రధాని, అమిత్​షా.. రాహుల్​గాంధీ మీద కక్ష కట్టారు. అందుకే రాహుల్​ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని షర్మిల ఫోన్​ చేసి ఆహ్వానించారు. బీజేపీ ఉంటే కలిసి వెళ్లవద్దని తమ కమిటి అభిప్రాయపడినట్లు చెప్పారు." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

  • ఒకటైతే నిజం… పచ్చి అబద్ధాన్ని కూడా ఇదే నిజం అనిపించేలా చెప్పడంలో నిన్ను మించినోడు లేడు కేసీఆర్!

    తెలంగాణలో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న లెక్కలు NCRB రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. లెక్కకు రానివి ఇంతకు పదింతలు.

    “రైతు స్వరాజ్య వేదిక” సమక్షంలో ఇద్దరం
    కూర్చుందాం… ఆత్మహత్యలు… pic.twitter.com/s30g8aS6No

    — Revanth Reddy (@revanth_anumula) April 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.