ETV Bharat / state

Revanth Reddy Arrest : గన్‌పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 1:22 PM IST

Updated : Oct 17, 2023, 2:36 PM IST

Revanth Reddy Arrest at Gun Park in Hyderabad : హైదరాబాద్ గన్​పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ఉండాలని కేసీఆర్‌కు ఛాలెంజ్ విసిరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమరవీరుల ముందు ప్రమాణం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయణ్ను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. రేవంత్ అరెస్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Revanth Reddy Arrest
Revanth Reddy Arrest

Revanth Reddy Arrest at Gun Park in Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ఎన్నికల సమయంలో నగదు, మద్యం ఏరులై పారుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో భారీ నగదు, మద్యాన్ని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రలోభాలను తగ్గించేందుకు ఓవైపు ఎన్నికల అధికారులు.. మరోవైపు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఎలక్షన్​లో ఎటువంటి ప్రలోభాలు పెట్టకూడదని.. డబ్బు, మద్యం పంచకుండా ప్రచారం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్​కు సవాల్ విసిరారు.

Revanth Reddy Fires on CM KCR : ఈ సవాల్​లో భాగంగా.. ఇవాళ హైదరబాద్​లో అమరవీరుల స్థూపం ప్రమాణం చేసేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించ ిన పోలీసులు రేవంత్​ రెడ్డిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఓ వాహనంలో ఆయణ్ను గాంధీ భవన్​కు తరలించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కేసీఆర్ సర్కార్ తీరుపైనా విమర్శలు గుప్పించారు.

Revanth Reddy Reacts on BRS Manifesto : 'కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలనే కేసీఆర్‌ కాపీ కొట్టారు'

Revanth Reddy On Pravalika Suicide : కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి కుంటుపడిందని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. గ్రూప్-2 పోస్ట్​పోన్​తో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక విషయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీసీపీపై కేసు పెడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. మరణించిన చెందిన అమ్మాయి ఫోన్ సీజ్‌ చేస్తే సమాచారం బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సీజ్‌ చేసిన ప్రవళిక ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని.. ఫోన్ సమాచారం పై ఫోరెన్సిక్ నివేదిక రాక ముందే డీసీపీ ప్రెస్‌మీట్ ఎలా పెడతారని నిలదీశారు. డీసీపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మరోవైపు రేవంత్ అరెస్టుతో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారిని అక్కడి నుంచి పంపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పోలీసులు, కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాటు చోటుచేసుకుంది. అనంతరం అక్కడి నుంచి వారిని పోలీసులు వాహనాల్లో తరలించారు.

Revanth Reddy Speech at Congress Public Meeting in Vikarabad : 'తెలంగాణ దశ.. దిశ మార్చే సమయం వచ్చింది'

Congress Khammam MLA Tickets Issue : కాంగ్రెస్‌లో ఆశావహులకు టికెట్ల గుబులు.. మిగిలిన 8 స్థానాలపై ఉత్కంఠ

Last Updated : Oct 17, 2023, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.