Revanth Reddy Allegations on Liquorshop Licence : తెలంగాణలో జరుగుతున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లో చేరిన కొత్త నాయకులను ఆహ్వానిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన.. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రూ. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుందన్నారు.
Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'
Revanth on Double Bedroom Houses Delay : హైదరాబాద్లో డబుల్ బెడ్ రూం (Double Bedroom Houses) ఇళ్లు నిర్మించడానికి స్థలాలు లేవని పేరొన్న కేసీఆర్.. వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఖాళీ భూములను అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా భూములు కొన్నవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సూచించారు. కేసీఆర్ సొంత మనుషులకు అప్పగించుకునేందుకే వైన్ షాపులకు ముందే టెండర్లు (wine shops Licens process) వేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. షాపులకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగా.. ముందే టెండర్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు.
KTR Challenge to Telangana Congress Leaders : 'ఓఆర్ఆర్ అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా'
Licensing process for wine shops : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. వైన్ షాపులకు మళ్లీ టెండర్లు ప్రక్రియా నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ వాళ్లపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. పోలీసులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని.. మరో వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జోస్యం చేశారు.
Revanth Reddy Challenges KCR : కేసీఆర్కు తన నాయకత్వంపై నమ్మకముంటే.. వచ్చే శాసన సభ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. అలాగే జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి సీట్లు ఇవ్వాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని రేవంత్ అన్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ 14కు 14సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అలంపూర్, దేవరకద్రకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరారు.
"కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణను ఇచ్చింది ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని.. ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకోవడానికి కాదు. దళితుల భూములు గుంజుకోవాలని కాదు. పేదలకు కాంగ్రెస్ పట్టా భూములు ఇస్తే.. అభివృద్ధి ముసుగులో బీఆర్ఎస్ గుంజుకుంటోంది. రూ. 100కోట్లు పలికే భూములను ఎకరానికి కోటి అయినా పేదలకు ఇవ్వాలి కదా. హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకొంది. కేసీఆర్కు తన నాయకత్వంపై నమ్మకముంటే.. వచ్చే శాసన సభ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయాలి."- రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
Revanthreddy Speech in Lok Sabha : 'ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాల పుస్తకం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో'