కరోనా కారణంగా గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌లో కొన్ని నెలలుగా ఉపాధి లేక... ఇటు స్వస్థలాలకు తిరిగి రాలేక ఇబ్బంది పడుతున్న తెలుగువారికి ఎట్టకేలకు విముక్తి కలిగింది. ఆ దేశంలో ఇళ్లలో పనిచేసే శ్రామికులు, వివిధ పరిశ్రమల్లో పనిచేసే మొత్తం 171 మంది కార్మికులతో కూడిన ప్రత్యేక విమానం బహ్రెయిన్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చింది.
ఆ దేశంలో సీనియర్ పాత్రికేయుడిగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి వాసుదేవరావు చొరవ తీసుకుని స్థానిక ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చి గల్ఫ్ ఎయిర్ చార్టెడ్ ఫ్లైట్‌లో వీరిని హైదరాబాద్‌కు పంపించారు. విమాన టికెట్ కొనుగోలు చేయటానికి కొందరి వద్ద డబ్బులు లేకపోతే... అక్కడి పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి వారికి నగదు సర్దుబాటు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇవీ చూడండి: 'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'