ETV Bharat / state

'ఊరికి మొనగాళ్లు' పేరిట కథనం... స్పందించిన ప్రభుత్వం

తరతరాలుగా ఎదుర్కొంటున్న సమస్యపై ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోవడంతో శ్రమదానమే పరిష్కారంగా భావించి వారంతా రంగంలోకి దిగారు. 2 నెలలుగా కొండను పిండి చేస్తూ కండల కరిగిస్తూ రహదారిని నిర్మిస్తున్నారు. ఊరికి మొనగాళ్లుగా వారి సాగిస్తున్న శ్రమయజ్ఞాన్ని ఈటీవీ-ఈటీవీ భారత్​ వెలుగులోకి తీసుకువచ్చింది.. అది చూసి ఏపీ ప్రభుత్వం నిధులిచ్చేందుకు ముందుకొచ్చింది. శ్రమజీవుల కృషికి తగ్గ ఫలితం దక్కబోతోంది.

response to etv bharat story
"ఊరికి మొనగాళ్లు" పేరిట కథనం... స్పందించిన ప్రభుత్వం
author img

By

Published : Sep 4, 2020, 7:59 AM IST

"ఊరికి మొనగాళ్లు" పేరిట కథనం... స్పందించిన ప్రభుత్వం

అభివృద్ధికి అమడ దూరంలో ఉండే గిరిజనుల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడతాయి. మరి వాటిని పొందాలన్నా... చదువుకోవాలన్న ముందు ఊరి నుంచి బయటకు వెళ్లాలంటే మంచి రహదారి ఉండాలి. సరైన దారి లేక ఎన్నో గిరిజన గ్రామాలు ప్రగతిఫలాలను పొందలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్​ విశాఖ జిల్లా హుకుంపేట మండలం ఎగమాలపాడులోనూ అదే పరిస్థితి. రహదారులు కావాలని 35 ఏళ్లుగా గిరిజనం కోరుతున్నా పట్టించకున్నానాథుడే లేడు. ఎన్నాళ్లీ వెతలని భావించిన ఎగమాలపాడు వాసులు.. ఎవరికోసమో ఎదురుచూడకుండా రహదారి నిర్మాణం కోసం ఇంజినీర్లుగా మారారు. శ్రమనే మేథస్సుగా మార్చి చూడచక్కని దారిని ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఈటీవీ-ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం

ఎగమాలపాడు శ్రమజీవుల కష్టాన్ని"ఊరికి మొనగాళ్లు" పేరిట ఈటీవీ-ఈటీవీ భారత్​ కథనం ప్రసారం చేసింది. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. రహదారిని ఉపాధి పనుల్లో చేరుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కిలోమీటర్ల మేర పూర్తి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే గిరిజనులు కుటుంబ సమేతంగా శ్రమతో తయారుచేసిన రహదారికి 3,444 పనిదినాలు కల్పించి 9,35,440 రూపాయల నగదును చేసిన పనికి విడుదల చేశారు.

వర్షాలనూ లెక్కచేయకుండా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇప్పటివరకు 3 కిలోమీటర్ల వరకు రహదారి నిర్మించుకున్నారు. ఈటీవీ-ఈటీవీ భారత్​ కథనంతో అధికారులు దిగి రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా ఈటీవీ-ఈటీవీ భారత్​కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో దరఖాస్తులు బుట్టదాఖలు అయ్యాయని ఒక్క ఈటీవీ-ఈటీవీ భారత్​ కథనంతో అధికార గణం ముందుకు వచ్చిందని విద్యార్థి హక్కుల సంఘం ప్రతినిధి కృష్ణా రావు తెలిపారు.

ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.