'దిశ' యాప్ ద్వారా మహిళా అధికారికి పోలీసులు అండగా నిలిచిన ఘటన ఆంధ్రప్రదేశ్... పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తోన్న బస్సులో ఓ మహిళ పట్ల తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ సహాయం కోసం తెల్లవారుజమున 4 గంటల సమయంలో దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది.
ఎస్వోఎస్ కాల్
యాప్లో ఎస్వోఎస్ కాల్ ద్వారా ఉదయం 4.21 గంటలకు మంగళగిరి దిశ కాల్ సెంటర్కు సమాచారం అందింది. దగ్గర్లోని ఎమెర్జెన్సీ టీంకు సిబ్బంది సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు 6 నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి వద్దకు చేరుకుని నిందితుణ్ని అదుపులోకి తీసుకుని మహిళను రక్షించారు. అతన్ని ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు జీరో కేసు నమోదు చేశారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రొఫెసర్‌గా గుర్తించారు. ఈ కేసు పెదపాడు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో నిందితుణ్ని అక్కడికి తరలించారు.
సీఎం అభినందన
దిశ యాప్ ద్వారా మహిళా అధికారికి అండగా నిలిచిన ఈ కేసును ఏపీ డీజీపీ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. సకాలంలో స్పందించి మహిళను కాపాడిన సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: