జీహెచ్ఎంసీ వార్డుల పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాాబాద్ ఎన్నికలపై చర్చించినట్లు మర్రి తెలిపారు.
2016లో నోటిఫికేషన్‌కు కొన్ని గంటల ముందు రిజర్వేషన్ ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఈసారి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ముందుగానే ప్రకటించాలని కోరారు. గతంలో జనాభా లెక్కలకు సంబంధం లేకుండా రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు చేశారని వెల్లడించారు. అధికార పార్టీకి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు ప్రకటనకు ముందు అభ్యంతరాలకు 15 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల కమిషనర్‌ను, కొత్త ఎన్నికల అధికారిని తాము త్వరలోనే కలుస్తామని వివరించారు. ఎలక్షన్లపై ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. 500 మించి ఓటర్లు ఉండకుండా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: జాతకంలో దోషమన్నాడు... తాళికట్టి నువ్వే నా భార్య అన్నాడు