ETV Bharat / state

థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి - telangana news today

రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేలా సీఎం కేసీఆర్​ అనుమతి ఇవ్వాలని... సినిమా హాళ్ల యాజమాన్యం డిమాండ్‌ చేసింది. గతంలో వసూలు చేసిన నామినల్ ఛార్జీలనే తీసుకుంటామని పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా టికెట్ల ధరల నిర్ణయంతోపాటు పార్కింగ్ ఫీజు చెల్లింపుపై ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

request-to-allow-parking-fees-in-theaters-in-telangana
థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి
author img

By

Published : Mar 4, 2021, 4:27 AM IST

థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి

రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని సినిమా హాళ్ల యాజమాన్యం డిమాండ్ చేసింది. గతంలో వసూలు చేసిన నామినల్ ఛార్జీలనే తీసుకుంటామని.. పలువురు థియేటర్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు.

మల్టీఫ్లెక్స్ థియేటర్లలో ఎవరో చేసిన తప్పునకు రెండేళ్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు పూర్తిగా నష్టపోయాయని.. తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్​లో సమావేశమై తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించారు.

సినిమా హాల్స్​కు జీహెచ్​ఎంసీ ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం.. హాస్యస్పదంగా ఉందన్న సినిమా హాల్స్ యజమానులు... పార్కింగ్ ఫీజు రద్దు చేయడం వల్ల ఇప్పటికే ఎంతో నష్టపోయామని వాపోయారు. వెంటనే ప్రభుత్వం థియేటర్లలో సినిమా టికెట్ల ధరల నిర్ణయంతోపాటు.. పార్కింగ్ ఫీజు చెల్లింపుపై ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సినిమా థియేటర్ల విషయంలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలను వెంటనే ఉత్తర్వుల రూపంలో విడుదల చేయాలని కోరారు.

ఇదీ చూడండి : 'ఆదిపురుష్'​ సెట్​లో​ అగ్నిప్రమాదానికి కారణమిదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.