తెలంగాణ హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. చీఫ్ జస్టిస్ అశోక్ సింగ్ చౌహాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మార్షల్స్‌చే గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్నిప్పర్ డాగ్‌తో పూల బొకే స్వీకరించారు. బషీర్‌బాగ్‌లోని లోకాయుక్తలో కార్యాలయంలో... లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య జెండా వందనం చేశారు.
బస్‌భవన్‌లో
హైదరాబాద్ బస్‌భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో సంస్థను అభివృద్ధిలోకి తోసుకెళ్తామని చెప్పారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయంలో
నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి.. జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి వాణి ప్రసాద్, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో
హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వైభవంగా జరిగాయి. కమిషనర్ లోకేశ్ కుమార్ పోలీసులు కవాతు స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబాఫాసియూద్దీన్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్ని జాతీయ గీతాన్ని ఆలపించారు.
డీజీపీ కార్యాలయంలో
లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. పోలీసులు కవాతును స్వీకరించిన అడిషనల్ డీజీపీ ఉమేష్ షార్రఫ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చంచల్‌గూడ జైల్లో జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జైళ్ల శాఖలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. నెరేడ్మెట్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్ మహేశ్ భగవత్ జాతీయ జెండా వందనం చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10సీ ఎమ్మెల్యే, ఎంపీల కాలనీలోని సీఆర్‌పీఎఫ్ సదరన్ సెక్టార్ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఆర్‌పీఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీపీ ఎం.ఆర్ నాయర్... మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ గాంధీనగర్ డివిజన్లో త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎగురవేశారు.
ఇవీచూడండి: ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు.