ETV Bharat / state

భాగ్యనగరంలో బడిబాట.. విద్యార్థుల్లో ఉల్లాసం

పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. గత పది నెలలుగా కరోనా విపత్కర పరిస్థితి మూలంగా ఇళ్లలో ఆన్​లైన్​ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు.. ఇప్పుడు బడి బాట పట్టారు.

భాగ్యనగరంలో మళ్లీ బడిబాట పట్టిన విద్యార్థులు

author img

By

Published : Feb 1, 2021, 1:03 PM IST

Updated : Feb 1, 2021, 1:42 PM IST

సికింద్రాబాద్​లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కరోనా నిబంధనలను అనుసరించి హాజరవుతున్నారు. సీతాఫల్​మండి, మారేడుపల్లి, బోయిన్​పల్లి, అల్వాల్​, తిరుమలగిరి ప్రాంతాల్లో పాఠశాలకు విద్యార్థులు తరలివస్తున్నారు.

మేడ్చల్​ జిల్లా మల్లాపూర్​ డివిజన్​లో మండల ప్రజా పరిషత్​ స్కూల్​కు మొదటిరోజు సుమారు 60శాతం విద్యార్థులు హాజరైనట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల వాష్​రూమ్​లు సరిగా లేవని, అటెండర్​, వాచ్​మెన్​ నియామకం లేమితో సమస్యగా మారిందని ప్రధానోపాధ్యాయుడు శివకుమార్​ పేర్కొన్నారు.

మలక్​పేట ఏరియా ప్రభుత్వ పాఠశాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుని క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.

Last Updated : Feb 1, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.