రాష్ట్రానికి వచ్చే నెల 10 లోపు 1,334 అద్దె బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇ.యాదగిరి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి డిపోను సందర్శించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం 11 రీజియన్ల పరిధిలో 97 డిపోల్లో 10,461 బస్సులు రోజూ 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయని, సగటున రూ.12 కోట్ల రాబడి వస్తోందని చెప్పారు. ఛార్జీల పెంపుతో రాబడి రూ.1.5 కోట్లు పెరిగిందని, మొత్తంగా సంస్థ రూ.400 కోట్ల నష్టాల్లో ఉందన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చే క్రమంలో 97 డిపోలను సీనియర్ అధికారులు దత్తత తీసుకున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండిః చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు