రాష్ట్రం పునరుత్పాదక ఇంధనంపై లక్ష్యాన్ని అధిగమించడం గర్వించదగ్గ విషయమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిబద్ధత, పర్యావరణం పట్ల ప్రత్యేక దృష్టి వల్లే ఇది సాధ్యమయిందన్నారు. ఆ నిబద్ధత నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ లక్ష్యాన్ని అధిగమించిన వాటిలో తెలంగాణ, అండమాన్ మరియు నికోబార్ దీవులు, కర్ణాటకలు ఉన్నాయని తెలిపారు. ఆ మూడింటిలో తెలంగాణ రాష్ట్రం ఉండడం అభినందనీయమని కేటీఆర్ వెల్లడించారు.
ఇదీ చూడండి : 'న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం'