ETV Bharat / state

రిమాండ్​ రిపోర్టు: శంషాబాద్​ ఘటనలో విస్తుపోయే నిజాలు - priyanka reddy veterinary doctor rape case

శంషాబాద్​కు చెందిన యువతి హత్యాచారం ఘటనలో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్​నగర్ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట నలుగురు నిందితులను హాజరుపర్చగా... 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్​లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు 21 న బయలుదేరినప్పటి నుంచి దారుణానికి ఒడిగట్టి ఇంటికి చేరేవరకు చేసిన కృత్యాలన్ని బట్టబయలయ్యాయి.

REMAND REPORT ON SHAMSHABAD RAPE CASE
REMAND REPORT ON SHAMSHABAD RAPE CASE
author img

By

Published : Dec 1, 2019, 5:06 AM IST

Updated : Dec 1, 2019, 1:23 PM IST

శంషాబాద్ దారుణ ఘటనలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హత్యకు పాల్పడిన తీరును నిందితుల నుంచి సేకరించారు. రిమాండ్ రిపోర్టు ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతిని అత్యాచారం చేయాలనే దురుద్దేశంతోనే నలుగురు యువకులు ఆమె ద్విచక్ర వాహనం వెనక టైరులో గాలి తీసినట్లు తేలింది. నిందితులకు మద్యం తాగే అలవాటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

21న లారీ బయలుదేరింది...

హత్యకు పాల్పడిన నలుగురు నిందితులు... మక్తల్ మండల వాసులు. జక్లేర్​కు చెందిన మహ్మద్ ఆరిఫ్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. 2012 నుంచి 2015 వరకు కూకట్ పల్లిలో ఆటో డ్రైవర్​గా పనిచేశాడు. 2017 నుంచి లారీ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా... రాయిచూర్ నుంచి హైదరాబాద్​కు లారీ నడిపిస్తున్నాడు. పక్క గ్రామమైన గుడిగండ్లకు చెందిన శివ.. లారీ క్లీనర్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 21న బూర్గుల నుంచి రాయిచూర్​కు ఇనుప కడ్డీల లోడ్​ను తీసుకెళ్లారు.

ఆర్టీఓ తనిఖీల నుంచి తప్పించుకున్నారు...

రాయిచూర్ వెళ్లే క్రమంలో మక్తల్ సమీపంలో ముళ్ల పొదల్లో కొన్ని ఇనుప కడ్డీలను ఆరిఫ్ పడేసి వెళ్లాడు. 24న తిరుగు ప్రయాణంలో యజమాని శ్రీనివాస్ రెడ్డి చెప్పడం వల్ల కర్ణాటకలోని గంగావతిలో ఇటుకల లోడ్​తో హైదరాబాద్​కు పయనమయ్యారు. మార్గమధ్యలో నవీన్, చెన్నకేశవులును వెంట తీసుకొచ్చాడు. గుడిగండ్లకే చెందిన నవీన్, చెన్నకేశవులు కూడా నాగరాజు లారీ ట్రాన్స్ పోర్టులోనే పనిచేస్తున్నారు. వచ్చేటప్పుడు ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిన ఇనుప కడ్డీలను లారీలో వేసుకున్నారు. మహబూబ్​నగర్​కు చేరుకోగానే ఆర్టీఓ తనిఖీల్లో ఆరిఫ్ పట్టుబడ్డాడు. అతనికి డ్రైవింగ్ లైసెన్సు లేకపోవటం వల్ల వాహనాన్ని నిలిపేశారు. మాయమాటలు చెప్పిన ఆరిఫ్... లారీతో సహా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

ఇనుపకడ్డీలమ్మి సొమ్ము చేసుకున్నారు...

రాయికల్ వద్ద ఇనుప కడ్డీలను విక్రయించి రూ.4వేలు ఆర్జించాడు. 26వ తేదీ రాత్రి 9 గంటలకు తొండుపల్లిలో లారీని నిలిపాడు. ఇటుకలను ఎక్కడ దింపాలనేది యజమాని శ్రీనివాస్​రెడ్డి చెప్పకపోవటం వల్ల అక్కడే లారీని నిలిపేశాడు. పోలీసులు లారీని ఇక్కడి నుంచి తీసేయాలని ఆదేశించగా... తొండుపల్లి జంక్షన్ జాతీయ రహదారి పక్కన నిలిపారు.

కామాంధుల క్రూర'కృత్యాలు'...

  1. 27 సాయంత్రం 5.30 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసి నలుగురు పీకలదాకా తాగారు.
  2. సాయంత్రం 6 గంటలకు లారీ పక్కనే ద్విచక్ర వాహనం పార్కు చేసిన శంషాబాద్ యువతిని గమనించిన నిందితులు... ఆమెపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
  3. యువతి గచ్చిబౌలి వెళ్లిన విషయాన్ని గమనించారు. యువతి తిరిగి వచ్చేలోపు... ద్విచక్ర వాహనంలోని వెనక టైరులో గాలిని నవీన్​ తీసేశాడు.
  4. అదేరోజు రాత్రి 9.30 గంటలకు అమ్మాయి తిరిగి రాగానే టైరు పంక్చర్​ అయిందని.. రిపేయిర్​ చేయిస్తామని చెన్నకేశవులు, ఆరిఫ్ ఒప్పించారు. పంక్చర్​ చేయించేందుకు శివ వెళ్లాడు.
  5. లారీ డ్రైవర్లు తనతో అదోలా ప్రవర్తిస్తున్నారని... భయమేస్తుందన్న విషయాన్ని ఫోన్​లో యువతి తన సోదరికి వివరించింది.
  6. మొదటిసారి దుకాణాలు మూసి ఉన్నాయని తిరిగి వచ్చిన శివ... రెండోసారి మరో షాప్​కు వెళ్లి పంక్చర్ చేయించుకొని వచ్చాడు.
  7. శివ వచ్చేలోపు ఆరిఫ్, నవీన్, చెన్నకేశవులు కలిసి యువతిని బలవంతంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు. యువతి సెల్​ఫోన్​ను లాక్కొని నవీన్​ స్విఛ్చాఫ్​ చేశాడు. చెన్నకేశవులు, నవీన్ కలిసి యువతి నోట్లో బలవంతంగా మద్యం పోశారు.
  8. యువతిని చెన్న కేశవులు. నవీన్, ఆరిఫ్, శివ వరుసగా సామూహిక అత్యాచారం చేశారు. హెల్ప్ హెల్ప్ అంటున్నా... యువతిని నిందితులు వదల్లేదు. తీవ్ర రక్తస్రావమై యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
  9. కాసేపటి తర్వాత మెలకువ రావటం గమనించిన నిందితులు.... యువతిని హత్య చేయాలని అనుకున్నారు. యువతి నోరు, ముక్కుపై ఆరిఫ్​ గట్టిగా అదిమి పట్టడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది.
  10. యువతి సెల్ ఫోన్, వాచ్, పవర్​బ్యాంక్​ను నవీన్ తీసుకున్నాడు. మృతదేహాన్ని దుప్పట్లో కప్పి లారీ క్యాబిన్​లోకి ఎక్కించారు. చెన్నకేశవులు, ఆరిఫ్ లారీలో వెళ్లగా... ద్విచక్ర వాహనంపై శివ, నవీన్.... షాద్​నగర్ వైపు బయలుదేరారు.
  11. డీజిల్ పోసి తగులబెట్టాలనుకుని పూర్తిగా తగులబడదేమోనని మార్గమధ్యలో పెట్రోల్ కూడా కొనుగోలు చేశారు.
  12. చటాన్​పల్లి జాతీయ రహదారి వంతెన కిందికి యువతి మృతదేహాన్ని తీసుకెళ్లారు. యువతి మృతదేహంపై మొదట ఆరిఫ్ పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత నవీన్ డీజిల్ పోశాడు. శివ మృతదేహానికి అగ్గిపెట్టెతో నిప్పంటించాడు.
  13. యువతి సిమ్ కార్డు, హ్యాండ్ బ్యాగును నిందితులు మంటల్లో వేశారు. అనంతరం ఆరిఫ్, చెన్నకేశవులు లారీలో అక్కడి నుంచి బయల్దేరగా శివ, నవీన్ ద్విచక్ర వాహనంపై వచ్చారు. కొత్తూర్ జాతీయ రహదారి పక్కన ద్విచక్ర వాహనం వదిలిపెట్టి శివ, నవీన్ కూడా లారీలో ఎక్కారు.
  14. 28వ తేదీ తెల్లవారుజామున 4గంటల సమయంలో ఆరాంఘర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి శివ 5.30 నిమిషాలకు గుడిగండ్లకు వెళ్లిపోగా.... నవీన్, చెన్నకేశవులు 7గంటలకు వెళ్లారు. ఆరిఫ్ శంషాబాద్​లోని ఆటోనగర్​లో లారీని ఉంచి స్వగ్రామం జక్లేర్​కు వెళ్లాడు.

చరవాణి దొరకలేదు...

హత్య జరిగిన క్రమాన్ని మొత్తం రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు... యువతికి చెందిన చరవాణి, పవర్ బ్యాంక్, చేతివాచి మాత్రం లభించలేదని తెలిపారు. కేసులో పురోగతి కోసం నిందితులను కస్టడీ కోరే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్​

TG_HYD_07_01_REMAND_REPORT_PKG_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) శంషాబాద్ కు చెందిన యువతి హత్యాచారం ఘటనలో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్ నగర్ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట నలుగురు నిందితులను హాజరుపర్చడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులు యువతిపై అత్యాచారం, దోపిడీ చేయాలని ముందే కుట్ర పన్నినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పలు సంచలన విషయాలు రిమాండ్ రిపోర్టులో వెలుగులోకి వచ్చాయి.....LOOK V.O- శంషాబాద్ యువతి హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హత్యకు పాల్పడిన తీరును నిందితుల నుంచి సేకరించారు. ఈ విషయాలు రిమాండ్ రిపోర్టు ద్వారా వెలుగులోకి వచ్చాయి. యువతిని అత్యాచారం చేయాలనే ఉద్దేశంతోనే నలుగురు యువకులు ఆమె ద్విచక్ర వాహనం వెనక టైరులో గాలి తీసినట్లు తేలింది. నలుగురు నిందితులు కూడా జల్సాలకు అలవాటు పడి మద్యం తాగే అలవాటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. V.O- హత్యకు పాల్పడిన నలుగురు నిందితులు కూడా మక్తల్ మండల వాసులు. జక్లేర్ కు చెందిన మహ్మద్ ఆరిఫ్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. 2012 నుంచి 2015 వరకు కూకట్ పల్లిలో ఆటో డ్రైవర్ గా పనిచేశాడు. 2017 నుంచి శ్రీనివాస్ రెడ్డి దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా రాయిచూర్-హైదరాబాద్ కు లారీ నడిపిస్తున్నాడు. పక్క గ్రామమైన గుడిగండ్లకు చెందిన శివ లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 21వ తేదీ బూర్గుల నుంచి రాయిచూర్ కు ఇనుప కడ్డీల లోడ్ ను తీసుకెళ్లారు. రాయిచూర్ వెళ్లే క్రమంలో మక్తల్ సమీపంలో ముళ్ల పొదల్లో కొన్ని ఇనుప కడ్డీలను ఆరిఫ్ పడేసి వెళ్లాడు. 24వ తేదీన తిరుగు ప్రయాణంలో యజమాని శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో కర్నాటకలోని గంగావతిలో ఇటుకల లోడ్ తో హైదరాబాద్ కు పయనమయ్యారు. మార్గమధ్యలో నవీన్, చెన్నకేశవులును హైదరాబాద్ కు వెంట తీసుకొచ్చాడు. గుడిగండ్లకే చెందిన నవీన్, చెన్నకేశవులు కూడా శ్రీనివాస్ రెడ్డికి చెందిన నాగరాజు లారీ ట్రాన్స్ పోర్టులోనే పనిచేస్తున్నారు. వచ్చేటప్పుడు ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిన ఇనుప కడ్డీలను లారీలో వేసుకున్నారు. మహబూబ్ నగర్ కు చేరుకోగానే ఆర్టీఓ తనిఖీల్లో ఆరిఫ్ పట్టుబడ్డాడు. అతనికి డ్రైవింగ్ లైసెన్సు లేకపోవడంతో వాహనాన్ని నిలిపేశారు. మాయమాటలు చెప్పి ఆరిఫ్ లారీతో సహా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రాయికల్ వద్ద ఇనుప కడ్డీలను విక్రయించి వచ్చిన 4వేలను ఆరిఫ్ జేబులో వేసుకున్నాడు. 26వ తేదీ రాత్రి 9 గంటలకు తొండుపల్లి గ్రామంలో లారీని నిలిపాడు. ఇటుకలను ఎక్కడ దింపాలనేది యజమాని శ్రీనివాస్ రెడ్డి చెప్పకపోవడంతో అక్కడే లారీని నిలిపారు. పోలీసులు లారీని ఇక్కడి నుంచి తీసేయాలని ఆదేశించడంతో... తొండుపల్లి జంక్షన్ జాతీయ రహదారి పక్కన నిలిపారు. 27వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసి నలుగురు పూటుగా తాగారు. సాయంత్రం 6 గంటలకు లారీ పక్కనే ద్విచక్ర వాహనం పార్కు చేసిన శంషాబాద్ యువతిని గమనించిన నిందితులు ఆమెపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె గచ్చిబౌలీ వెళ్లిన విషయాన్ని గమనించారు. V.O - యువతి తిరిగి వచ్చేలోపు నవీన్ ద్విచక్ర వాహనంలోని వెనక టైరులో గాలి తీసేశాడు. రాత్రి 9.30 గంటలకు తిరిగి రాగానే టైరులో గాలిలేదని... పట్టిచ్చుకొస్తామని యువతిని చెన్నకేశవులు, ఆరిఫ్ ఒప్పించారు. శివ టైరులో గాలి పట్టించుకు రావడానికి వెల్లాడు. యువతి అక్కడ జరిగిన సంఘటనను తన సోదరికి వివరించింది. లారీ డ్రైవర్లు తనతో అదోలా ప్రవర్తిస్తున్నారని... భయమేస్తుందనే విషయాన్ని ఫోన్ లో వివరించింది. మొదటిసారి దుకాణాలు మూసి ఉన్నాయని తిరిగి వచ్చిన శివ... రెండోసారి వెళ్లి టైరులో గాలి పట్టించుకొచ్చాడు. అతను వచ్చేలోపు ఆరిఫ్, నవీన్, చెన్నకేశవులు కలిసి యువతిని బలవంతంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న ఖాళీ స్థలం చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు. యువతి సెల్ ఫోన్ ను నవీన్ లాక్కొని స్విచాఫ్ చేశాడు. చెన్నకేశవులు, నవీన్ కలిసి యువతి నోట్లో బలవంతంగా మద్యం పోశారు. ఆ తర్వాత యువతిని చెన్న కేశవులు. నవీన్, ఆరిఫ్, శివ వరుసగా సామూహిక అత్యాచారం చేశారు. హెల్ప్ హెల్ప్ అంటున్న నిందితులు యువతిని వదలలేదు. దీంతో తీవ్ర రక్తస్రావమై యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కాసేపటి తర్వాత మెలకువ రావడంతో గమనించి యువతిని హత్య చేయాలని నిందితులు నిర్ధారించుకున్నారు. ఆరిఫ్ యువతి నోరు, ముక్కుపై గట్టిగా అదిమి పట్టడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. యువతి సెల్ ఫోన్, వాచ్, పవర్ బ్యాంక్ ను నవీన్ తీసుకున్నాడు. మృతదేహాన్ని దుప్పట్లో కప్పి లారీ క్యాబిన్ లోకి ఎక్కించారు. చెన్నకేశవులు, ఆరిఫ్ లారీలో వెళ్లగా... ద్విచక్ర వాహనంపై శివ, నవీన్ షాద్ నగర్ వైపు బయల్దేరారు. డీజిల్ పోసి తగులబెట్టాలనుకుని పూర్తిగా తగులబడదేమో అని ఉద్దేశంతో మార్గమధ్యలో పెట్రోల్ కూడా కొనుగోలు చేశారు. చటాన్ పల్లి జాతీయ రహదారి వంతెన కింద యువతి మృతదేహాన్ని తీసుకెల్లారు. యువతి మృతదేహంపై మొదట ఆరిఫ్ పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత నవీన్ డీజిల్ పోశాడు. శివ మృతదేహానికి అగ్గిపెట్టెతో నిప్పంటించాడు. యువతి సిమ్ కార్డు, హ్యాండ్ బ్యాగును నిందితులు మంటల్లో వేశారు. అనంతరం ఆరిఫ్, చెన్నకేశవులు లారీలో అక్కడి నుంచి బయల్దేరగా శివ, నవీన్ ద్విచక్ర వాహనంపై వచ్చారు. కొత్తూర్ జాతీయ రహదారి పక్కన ద్విచక్ర వాహనం వదిలిపెట్టి శివ, నవీన్ కూడా లారీలో ఎక్కారు. 28వ తేదీ తెల్లవారుజామున 4గంటల సమయంలో ఆరాంఘర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి శివ 5.30 నిమిషాలకు గుడిగండ్లకు వెళ్లిపోగా.... నవీన్, చెన్నకేశవులు 7గంటలకు వెళ్లారు. ఆరిఫ్ మాత్రం శంషాబాద్ లోని ఆటోనగర్ లో ఇటుక లోడ్ తో ఉన్న లారీని పెట్టి యజమానికి చెప్పి తన గ్రామమైన జక్లేర్ కు వెళ్లాడు. E.V.O- హత్య జరిగిన క్రమాన్ని మొత్తం రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు.. యువతికి చెందిన చరవాణి, పవర్ బ్యాంక్, చేతివాచి మాత్రం లభించలేదని తెలిపారు. కేసులో పురోగతి కోసం నిందితులను కస్టడీ కోరే అవకాశం ఉంది.
Last Updated : Dec 1, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.