కోవిడ్ -19 కారణంగా రెగ్యులర్ ప్యాసింజర్, సబర్బన్ రైళ్లను తదుపరి నోటీసు వచ్చే వరకు నివరధికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న 230 స్పెషల్ రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయని ద.మ.రైల్వే సీపీఆర్వో రాకేశ్ వెల్లడించారు.
ముంబైలోని స్థానిక రైళ్లు ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు పరిమిత ప్రాతిపదికన నడుస్తున్నాయన్నారు. ప్రత్యేక రైళ్ల రాకపోకలను రోజూ పర్యవేక్షిస్తున్నామని వివరించారు. అవసరాన్ని బట్టి అదనపు ప్రత్యేక రైళ్లను కూడా నడపవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది.