తెరాస కార్యకర్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు హామీ ఇచ్చారు. సభ్యత్వం పొందిన కార్యకర్తల కోసం రూ. 2 కోట్ల 50 లక్షల విలువైన బీమా చేసినట్లు కేకే వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని మేయర్ గద్వాల విజయలక్ష్మీ నివాసంలో కేకే ఆధ్వర్యంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
మేయర్ హామీ
ఖైరతాబాద్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని మేయర్ గద్వాల విజయలక్ష్మీ హామీ ఇచ్చారు. కార్యకర్తలకు ఏ సమస్య ఎదురైనా పరిష్కరించేందుకు ముందుంటామని పేర్కొన్నారు. తనకు మేయర్ పదవి కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కేసీఆర్‌తోనే నగరాభివృద్ధి సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఈనెల 20న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభిమానులతో షర్మిల భేటీ