ETV Bharat / state

Registrations: రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన రిజిస్ట్రేషన్​ల సంఖ్య - telangana registrations news

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్​ల సంఖ్య గణనీయంగా పెరిగింది. లాక్​డౌన్​ సడలింపుల సమయం పొడిగింపుతో క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్​ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. ఫలితంగా గురు, శుక్ర రెండు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.45.25 కోట్ల ఆదాయం సమకూరింది.

రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన రిజిస్ట్రేషన్​ల సంఖ్య

author img

By

Published : Jun 12, 2021, 5:21 AM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ సడలింపుల సమయం పొడిగింపుతో సబ్-రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్​ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నెల 10 నుంచి క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ల కోసం చొరవ చూపుతున్నారు. స్లాట్ బుకింగ్​ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నప్పటికీ.. కార్యాలయాల వద్ద క్రయవిక్రయదారులు ఎగబడుతున్నారు.

ఈ నెల 10 వరకు 15 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు పూర్తై.. రూ.90 కోట్ల ఆదాయం రాగా.. గురు, శుక్ర రెండు రోజుల్లో ఏకంగా 7,755 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.45.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడించాయి. శుక్రవారం వరకు ఈ నెలలో మొత్తం లక్షా 56 వేలు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్​ జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్​ ఛార్జీల కింద రూ.135.44 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇదీ చూడండి: టెస్ట్​ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్​.. ఎలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.